Viral Video: ఇది కంట పడితే కాస్త జాగ్రత్త.. అందంగా ఉంది కదా అని ముట్టుకున్నారనుకో.. ఇంక అంతే సంగతులు..
ABN , First Publish Date - 2023-08-15T19:43:04+05:30 IST
ప్రస్తుత యాంత్రిక జీవనంలో చాలా మంది అప్పుడప్పుడూ ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. ఈ సృష్టిలో నిక్షిప్తమైన ఎన్నో రకాలైన ప్రకృతి అందాలు కనువిందు చేయడంతో పాటూ మానసికోళ్లాసాన్ని కలిగిస్తుంటాయి. అయితే ఇలాంటి అందమైన ప్రకృతిలోనూ అనుకోని...
ప్రస్తుత యాంత్రిక జీవనంలో చాలా మంది అప్పుడప్పుడూ ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. ఈ సృష్టిలో నిక్షిప్తమైన ఎన్నో రకాలైన ప్రకృతి అందాలు కనువిందు చేయడంతో పాటూ మానసికోళ్లాసాన్ని కలిగిస్తుంటాయి. అయితే ఇలాంటి అందమైన ప్రకృతిలోనూ అనుకోని ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్లని.. ఓ సిని కవి అన్నట్లు.. పైకి అందంగా కనిపించేదంతా కొన్నిసార్లు నిజం కాకపోవచ్చు. ఇంకొన్నిసార్లు అది పెను ప్రమాదంగా కూడా మారొచ్చు. ఇక్కడ ఫొటోలో కనపడుతున్న పురుగే ఇందుకు ఉదాహరణ. పైకి అందమైన పువ్వులా కనిపిస్తోంది కదా అని ముట్టుకుంటే.. చివరకు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. దీంతో పాటూ మరో రెండింటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు..
భూమి మీద సంచరిల్లో కీటకాల్లో ప్రధానంగా ఈ మూడింటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో మొదటగా వెంట్రుకల గొంగళి పరుగు (caterpillar) గురించి చెప్పుకోవాలి. దీన్ని చూస్తే పైకి పువ్వులా కనిపిస్తుంది. సన్నగా పసుపు రంగులో ఉన్న ఈ పురుగులు అంటుకునే వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి. ఈ గొంగళి పరుగుల విషం (dangerous caterpillar) ప్రమాదకరమైనది. వీటిని తాకగానే భరించలేని నొప్పి కలుగుతుంది. కొన్ని రక్తస్రావం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఈ కీటకాలు ప్లోరిడా, టెక్సాస్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక రెండవ ప్రమాదకరమైన కీటకం వృశ్చికం. తేలు (scorpions) కాటు కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారొచ్చు. కొన్ని తేళ్లు పాములను కూడా వేటాడతాయి.
కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక చివరగా మూడో స్థానంలో ఉన్న జెల్లీ షిష్ (Jellyfish) కూడా ప్రమాదరమరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్ని రకాల జెల్లీ ఫిష్లకు దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో కనిపించే ఇరుకండ్జి అనే జెల్లీఫిష్ అత్యంత ప్రమాదరమైనదని చెబుతున్నారు. అదే విధంగా బాక్స్ జెల్లీ ఫిష్ కూడా చాలా ప్రమాదకరం. ఉష్ణమండల మహా సముద్రాల్లో ఇది విస్తృతంగా కనిపిస్తాయి. దీని విషం నాడీ వ్యవస్థపై దాడి చేసి, నిమిషాల వ్యవధిలోనే మనిషిని చంపగలదు. అలాంటి సమయాల్లో అత్యవర చికత్స అందిస్తే తప్ప బతికే అవకాశాలు ఉండవు. కాగా, ప్రస్తుతం ఈ కీటకాలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Viral Video: రైల్వే స్టేషన్లో దంపతుల మధ్య.. ఇలాంటి ఫైట్ ఇంతకు ముందెన్నడూ చూసుండరు..