Viral Video: బాత్రూంలోకి వెళ్లిన మహిళ.. అనుమానం వచ్చి తొంగిచూడగా షాకింగ్ సీన్.. చివరకు ఆమె చేసిన పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , First Publish Date - 2023-08-13T16:36:30+05:30 IST

అదేంటో తెలీదు కానీ.. బాత్రూంలో అడుగుపెట్టడానికి ముందు కొందరికి మనసులో ఏదో తెలియని భయం వెంటాడుతుంటుంది. కొందరేమో తెలియని శక్తులుంటాయేమోనని భ్రమ పడితే, మరికొందరేమో ఎక్కడ నుంచి.. ఏ పురుగోపుట్రో వస్తుందేమో అని కంగారు పడుతుంటారు. అసలే..

Viral Video: బాత్రూంలోకి వెళ్లిన మహిళ.. అనుమానం వచ్చి తొంగిచూడగా షాకింగ్ సీన్.. చివరకు ఆమె చేసిన పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ప్రతీకాత్మక చిత్రం

అదేంటో తెలీదు కానీ.. బాత్రూంలో అడుగుపెట్టడానికి ముందు కొందరికి మనసులో ఏదో తెలియని భయం వెంటాడుతుంటుంది. కొందరేమో తెలియని శక్తులుంటాయేమోనని భ్రమ పడితే, మరికొందరేమో ఎక్కడ నుంచి.. ఏ పురుగోపుట్రో వస్తుందేమో అని కంగారు పడుతుంటారు. అసలే ఇది సోషల్ మీడియా యుగం.. బాత్రూంలలో చోటుచేసుకునే ఊహించని ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇవి చూశాక మనుషుల్లో భయం ఇంకా పెరిగిపోతుంటుంది. తాజాగా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. బాత్రూంలోకి వెళ్లిన ఆమె.. అనుమానం వచ్చి కమోడ్‌‌లో చూడగా షాకింగ్ దృశ్యం కనిపించింది. చివరకు ఆమె చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో (Viral video) ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. యూఎస్‌లోని అరిజోనాకు చెందిన ఓ మహిళకు (US woman) షాకింగ్ అనుభవం ఎదరైంది. మిచెల్ లెస్ర్పాన్ అనే మహిళ ఇటీవల ఇంటికి తాళం వేసి బయటి ప్రాంతానికి వెళ్లింది. నాలుగు రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఆమె మరుగుదొడ్డికి వెళ్లగా లోపలి నుంచి ఏవో వింత శబ్ధాలు వినిపించాయి. అనుమానం వచ్చి కమోడ్‌‌ దగ్గరికి వెళ్లి చూడగా.. లోపలి నుంచి ఓ నల్లటి పాము (black snake) బయటికి వచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది.

Diamonds in Tea Powder: టీ పౌడర్ ప్యాకెట్‌ను కత్తిరించి.. ఓ ప్లేట్‌లో పోస్తోంటే బయటపడిన వజ్రాలు.. వాటి ఖరీదెంతో తెలిసి..!

కాసేపటికి తేరుకుని లోపలికి చేయి పెట్టి పామును (woman caught snake) పట్టుకుంటుంది. దీంతో పాము ఆమెను కాటేయడానికి కూడా ప్రయత్నిస్తుంది. పామును పట్టుకున్న ఆమె.. తర్వాత దాన్ని బయట వదలేస్తుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఈ వీడియో చూస్తుంటే.. బాత్రూం వెళ్లాలంటేనే భయమేస్తోంది’’.. అని కొందరు, ‘‘ఈ పాము ఇక్కడికెలా వచ్చిందబ్బా’’.. అని మరికొందరు, ‘‘పాములను ఇలా పట్టుకోవడం ప్రమాదకరం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Love story: రియల్ ‘‘మల్లీశ్వరి’’.. ప్రియుడి కోసం ఏకంగా వేల కోట్ల ఆస్తిని వదిలేసి.. చివరికి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్..

Updated Date - 2023-08-13T16:36:30+05:30 IST