Viral Video: ఇదేం పిచ్చిరా బాబోయ్..! కొండచిలువలతో కలిసి స్నానం చేయడంపై.. నెటిజన్ల షాకింగ్ రియాక్షన్..

ABN , First Publish Date - 2023-08-15T18:18:22+05:30 IST

ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్లుగా.. కొందరు మిగతా వారికి భిన్నంగా ప్రవర్తిస్తూ, అందులోనే ఆనందాన్ని పొందుతుంటారు. వింత వింత వాహనాల్లో ప్రయాణించే వారు కొందరైతే.. ఇంకొందరు తమ ఇళ్లల్లోనే పులులు, సింహాలను పెంచుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి వారిని....

Viral Video: ఇదేం పిచ్చిరా బాబోయ్..! కొండచిలువలతో కలిసి స్నానం చేయడంపై.. నెటిజన్ల షాకింగ్ రియాక్షన్..

ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్లుగా.. కొందరు మిగతా వారికి భిన్నంగా ప్రవర్తిస్తూ, అందులోనే ఆనందాన్ని పొందుతుంటారు. వింత వింత వాహనాల్లో ప్రయాణించే వారు కొందరైతే.. ఇంకొందరు తమ ఇళ్లల్లోనే పులులు, సింహాలను పెంచుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు.. ‘‘అరె! వీరికేమైనా పిచ్చా’’.. అని అనిపిస్తుంటుంది. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వ్యక్తి కొండచిలువలతో కలిసి స్నానం చేస్తున్న వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి స్నానానికి వెళ్తూ పనిలో పనిగా మెడలో రెండు కొండచిలువలను వేసుకుని వెళ్తాడు. బాత్‌రూమ్‌లో గోడలపై మరికొన్ని కొండచిలువలను అలంకారంగా ఏర్పాటు చేశాడు. మెడలో ఉన్న కొండచిలువలు శరీరంపై అటూ, ఇటూ తిరుగుతూ ఉండడాన్ని ఎంజాయ్ (Man who bathed with pythons) చేస్తూ స్నానం చేస్తాడు. మధ్య మధ్యలో గోడలపై ఉన్న కొండచిలువలతో కామెడీ చేస్తూ తన సరదాను తీర్చుకుంటాడు. కొండ చిలువలు కూడా అతడిని ఏమీ అనకుండా సైలెంట్‌గా ఉంటాయి.

Viral Video: రైల్వే స్టేషన్‌లో దంపతుల మధ్య.. ఇలాంటి ఫైట్ ఇంతకు ముందెన్నడూ చూసుండరు..

గోడపై ఉన్న కొండచిలువలు కూడా స్నానాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా అక్కడే ఉండిపోతాయి. ఇలా చాలా సేపు అతను కొండచిలువతో కలిసి స్నానం చేశాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇదేం పిచ్చిరా నాయనా’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది బాబాయ్’’.. అంటూ మరికొందరు, ‘‘జాగ్రత్త బ్రదర్.. ఇలాంటి సాహసాలు చేయడం ప్రమాదకరం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Crime: అసలు వీడు మనిషేనా.. కాబోయే భార్య అన్న ఒకే ఒక్క మాటకు.. ఇంత పని చేస్తాడునుకోలేదు..

Updated Date - 2023-08-15T18:18:22+05:30 IST