Tagore Movie Scene: ఠాగూర్ సినిమాను ఈ అమెరికా డాక్టర్లు చూశారేమో.. 65 ఏళ్ల మహిళ బతికే ఉందంటూ నాటకం.. చివరకు..!

ABN , First Publish Date - 2023-09-28T17:07:51+05:30 IST

ఆపరేషన్ గది నుంచి బయటికి వచ్చిన డాక్టర్.. కళ్లద్దాలు తీస్తూ... ‘‘సారీ మేము చాలా ట్రై చేశాం.. కానీ మీ పేషెంట్ చనిపోయాడు’’.. అని దీనంగా చెప్పిన డైలాగ్ వింటే వెంటనే ఠాగూర్ సినిమా గుర్తుకొస్తుంది. శవానికి చికిత్స చేసిన ఘటనలు సినిమాల్లోనే కాకుండా...

Tagore Movie Scene: ఠాగూర్ సినిమాను ఈ అమెరికా డాక్టర్లు చూశారేమో.. 65 ఏళ్ల మహిళ బతికే ఉందంటూ నాటకం.. చివరకు..!
ప్రతీకాత్మక చిత్రం

ఆపరేషన్ గది నుంచి బయటికి వచ్చిన డాక్టర్.. కళ్లద్దాలు తీస్తూ... ‘‘సారీ మేము చాలా ట్రై చేశాం.. కానీ మీ పేషెంట్ చనిపోయాడు’’.. అని దీనంగా చెప్పిన డైలాగ్ వింటే వెంటనే ఠాగూర్ సినిమా గుర్తుకొస్తుంది. శవానికి చికిత్స చేసిన ఘటనలు సినిమాల్లోనే కాకుండా కొన్నిసార్లు నిజ జీవితంలోనూ చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు గతంలో చాలా జరిగిన విషయం తెలిసిందే. తాజాగా, యూఎస్‌లో ఈ తరహా ఘటనే జరిగింది. 65 ఏళ్ల వృద్ధురాలు చనిపోయిందని తెలిసినా ఫేక్ ఆపరేషన్ చేశారు. చివరకు ఏం జరిగిందంటే..

యూఎస్‌లోని (US) ఓహియో పరిధిలో ఈ ఘటన చోటు చేసుుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల మహిళ.. గుండె సంబంధిత సమస్యతో (Heart related problem) ఓహియోలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అయితే ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సమయంలో ఆమె బాగానే ఉంది. పరీక్షించిన వైద్యులు ఆమెకు ఆపరేషన్ అవసరమని చెప్పారు. చివరకు ఆమెను ఐసీయూకు తరలించిన వైద్యుల బృందం ఆపరేషన్ (Operation) చేసింది. ఈ క్రమంలో పరిస్థితి విషమించి సదరు మహిళ మృతి (woman died) చెందింది. అయితే వైద్యులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఆమె ప్రాణాలతోనే ఉందని, ఆపరేషన్ చేస్తున్నట్లు నటించారు. సుమారు రెండు గంటల తర్వాత వృద్ధురాలి కుటుంబ సభ్యులను లోపలికి పిలిచి విషయం తెలియజేశారు. అయితే అప్పటికి వారికి ఎలాంటి అనుమానం కలగలేదు.

Woman: విధిరాత అంటే ఇదేనేమో.. 20 ఏళ్ల కూతురితోపాటు బైక్‌పై వెళ్తున్న 57 ఏళ్ల ఆ తల్లి ఎలా చనిపోయిందో తెలిస్తే..!

us.jpg

అయితే డెత్ సర్టిఫికెట్‌లో ఆమె చనిపోయిన సమయం సాయంత్రం 3గంటలగా ఉండగా, ఆస్పత్రి రికార్డుల్లో మాత్రం మధ్యాహ్నం 1గంటకే చనిపోయినట్లు ఉంది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో చివరకు ఈ విషయం పోలీసుల వరకూ చేరింది. ఇదిలావుండగా, వృద్ధురాలికి ఆపరేషన్ అవసరం లేకున్నా వైద్యులు కేవలం డబ్బుల కోసం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వృద్ధురాలి మరణం వెనుక గల అసలు కారణాలపై సమస్య దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వార్త ఇటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వైద్యులు ఠాగూర్ సినిమా చూశారేమో’’.. అని కొందరు, ‘‘ఇలాంటి వైద్యుల వల్ల ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి’’.. అని మరికొందరు, ‘‘చాలా ఆస్పత్రులు ఇలాగే తయారయ్యాయి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: మోదీకి ఫోన్ చేసి మాట్లాడించనా..? బైక్‌ను ఆపేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ముందు రెచ్చిపోయిన మహిళ.. చివరకు..!

Updated Date - 2023-09-28T17:07:51+05:30 IST