Woman: విధిరాత అంటే ఇదేనేమో.. 20 ఏళ్ల కూతురితోపాటు బైక్‌పై వెళ్తున్న 57 ఏళ్ల ఆ తల్లి ఎలా చనిపోయిందో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-09-28T15:30:34+05:30 IST
‘‘ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు.. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెందరూ’’.. అని ఓ సినీ కవి అన్నట్లు.. ఎప్పుడ ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా బాగున్న వారు.. అనూహ్య ఘటనల కారణంగా తిరిగిరానిలోకాలకు చేరుకుంటుంటారు. ఇలాంటి...
‘‘ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు.. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెందరూ’’.. అని ఓ సినీ కవి అన్నట్లు.. ఎప్పుడ ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా బాగున్న వారు.. అనూహ్య ఘటనల కారణంగా తిరిగిరానిలోకాలకు చేరుకుంటుంటారు. ఇలాంటి విచిత్ర ప్రమాదాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి విషాద ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 20 ఏళ్ల కూతురితోపాటు బైక్‌పై వెళ్తున్న 57 ఏళ్ల ఆ తల్లి ఎలా చనిపోయిందో తెలిస్తే..! అయ్యో పాపం.. అని అంటారు. వివరాల్లోకి వెళితే..
గోవాలోని (Goa) మార్గవో నగర పరిధి నవేలిమ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సర్జోరా ప్రాంతానికి చెందిన మస్కరెన్హాస్ అనే వ్యక్తికి.. భార్య సిల్వా (57), కుమార్తె లతీషా ఉన్నారు. లతీషాను రోజూ ఆమె తల్లి.. నవేలిమ్ లోని కళాశాల వద్ద దింపి వస్తూ ఉండేది. మంగళవారం కూడా యథావిధిగా స్కూటీపై కూతుర్ని ఎక్కించుకుని కళాశాలకు బయలుదేరింది. అయితే అదే ఆమెకు ఆఖరి రోజు అవుతుందని కలలో కూడా ఊహించలేదు. నవేలిమ్ వద్దకు చేరుకోగానే పక్కనే ఉన్న పెద్ద చెట్టు ( tree branch fell on the scooty) కొమ్మ ఒక్కసారిగా విరిగి స్కూటీపై పడింది.
ఈ ప్రమాదంలో కొమ్మ లతీషా తల్లికి బలంగా తాకడంతో తీవ్రగాయాలు కాగా.. లతీషాకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన చుట్టుపక్కల వారు వారిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆస్పత్రి తరలించారు. అయితే అక్కడ సిల్వా చికిత్స పొందుతూ మృతి (woman died) చెందింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. చెట్టు కొమ్మ కారణంగానే మహిళ మృతి చెందినట్లు చెప్పారు. మహిళ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా, ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలగా స్పందిస్తున్నారు. ‘‘విధి ఎంత విచిత్రమైంది’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇది చాలా బాధాకరం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.