Stomach Operation: 3 గంటల పాటు ఆపరేషన్.. 40 ఏళ్ల వ్యక్తి కడుపులోంచి డాక్టర్లు బయటకు తీసిన వస్తువులివే..!
ABN , First Publish Date - 2023-09-27T15:57:04+05:30 IST
కొన్నిసార్లు ఆస్పత్రులకు రోగులు విచిత్రమైన సమస్యలతో వస్తుంటారు. పైకి సాధారణ సమస్యలాగే అనిపించినా.. చివరకు పరీక్షలు చేశాకగానీ సమస్యకు అసలు కారణాలు తెలీవు. రోగుల కడుపులో నుంచి కత్తెర, వెంట్రుకలు, బ్యాండేజీలు బయటకు తీయడం గతంలో..
కొన్నిసార్లు ఆస్పత్రులకు రోగులు విచిత్రమైన సమస్యలతో వస్తుంటారు. పైకి సాధారణ సమస్యలాగే అనిపించినా.. చివరకు పరీక్షలు చేశాకగానీ సమస్యకు అసలు కారణాలు తెలీవు. రోగుల కడుపులో నుంచి కత్తెర, వెంట్రుకలు, బ్యాండేజీలు బయటకు తీయడం గతంలో చాలా సార్లు చూశాం. అయితే తాజాగా, పంజాబ్‌లో విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన 40 ఏళ్ల వ్యక్తి కడుపులో నుంచి డాక్టర్లు వివిధ రకాల వస్తువులను బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే..
పంజాబ్‌లోని (Punjab) మెగా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 40 ఏళ్ల ఓ వ్యక్తి రెండేళ్లుగా కడుపునొప్పితో (stomach ache) బాధపడుతున్నాడు. ఎందరో వైద్యులకు చూపించినా ఫలితం లేకపోవడంతో చివరకు ఇటీవల మెగాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కడుపునొప్పితో పాటూ జ్వరం, వాంతులతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన అతడికి వైద్యులు వివిధ రకాల పరీక్షలు చేశారు. చివరకు ఎక్స్‌రే, స్కానింగ్ చేయగా షాకింగ్ దృశ్యం కనిపించింది. కడుపులో ఏవో వస్తువులు (Iron objects in stomach) ఉన్నట్లు గుర్తించారు. దీంతో చివరకు ఆపరేషన్ చేసి అతడి కడుపులో ఉన్న అనేక రకాల వస్తువులను బయటికి తీశారు.
Viral Video: వామ్మో! కిటికీలో ఇరుక్కుపోయిన భారీ కొండచిలువ.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..
రోగి కడుపులో విచిత్రంగా ఇనుప బోల్టులు, స్క్రూలు, ఇయర్ ఫోన్లు, లాకెట్, అయస్కాంతాలు సహా వివిధ రకాల వస్తువులను చూసి వైద్యులతో పాటూ అంతా షాక్ అయ్యారు. సుమారు 3గంటల పాటు ఆపరేషన్ చేసి వాటిన్నంటినీ బయటికి తీసేశారు. తమ కెరీర్‌లోనే ఇలాంటి కేసు తొలిసారి అని వైద్యులు తెలిపారు. రోగి చాలా కాలం నుంచి తరచూ తన చేతికి దొరికిన వస్తువులను తింటున్నట్లు తెలిసింది. అతడి మానసిక పరిస్థితి బాగోలేనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో చాలా కాలంగా అతను సరిగా నిద్రపోలేదని, ఎంతో మంది వైద్యులకు చూపించినా ఫలితం లేదన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
Train Accident: ప్లాట్‌ఫామ్ మీదకే దూసుకొచ్చిన రైలు.. ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రయాణీకులు..