Viral Video: బైకులో వెళ్తున్న ప్రేమికులకు.. సడన్ షాక్ ఇచ్చిన స్నేహితులు.. బండిని ఫాలో అవుతూ చివరకు వీరు చేసిన పని..
ABN , First Publish Date - 2023-05-12T15:37:17+05:30 IST
కొన్ని ప్రేమ జంటలు రోజు రోజుకూ మరీ బరితెగించి ప్రవర్తిస్తున్నాయి. పట్ట పగలు పార్కుల్లో బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం, బైకుల్లో వెళుతూ అసభ్యకర పనులు చేయడం, చివరికి రైళ్లలో ప్రయాణికుల సమక్షంలో రాసలీలలు ఆడడం ఎక్కువైపోయింది. ప్రస్తుతం..
కొన్ని ప్రేమ జంటలు రోజు రోజుకూ మరీ బరితెగించి ప్రవర్తిస్తున్నాయి. పట్ట పగలు పార్కుల్లో బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం, బైకుల్లో వెళుతూ అసభ్యకర పనులు చేయడం, చివరికి రైళ్లలో ప్రయాణికుల సమక్షంలో రాసలీలలు ఆడడం ఎక్కువైపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కవవడంతో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బైకుపై వెళ్తున్న ప్రేమికులకు వారి స్నేహితులు సడన్ షాక్ ఇచ్చారు. బండిని ఫాలో అవుతూ మార్గ మధ్యలో వారు పని చూసి యువతి అవాక్కైంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఓ ప్రేమ జంట (lovers) బైకుపై వెళ్తుంటుంది. వారికి తెలీకుండా స్నేహితులు (friends) వెనుక నుంచి ఫాలో అవుతుంటారు. కొద్ది దూరం వెళ్లగానే వెనుక కూర్చున్న ప్రేయసి.. ప్రియుడిని కౌగిలించుకుంటుంది. ఈలోగా వారిని సర్ఫ్రైజ్ (Friends surprised lovers) చేసేందుకు స్నేహితులంతా సిద్ధమవుతారు. ముందుగా లవ్ సింబల్ (Love symbol) గుర్తు ఉన్న టీషర్ట్ ధరించిన వ్యక్తి.. స్కూటీపై ప్రేమికులను ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్తాడు. తర్వాత ఐ అక్షరం ఉన్న టీషర్టు ధరించిన వ్యక్తి ముందుకు వెళతాడు. చివరగా యూ అనే అక్షరం ఉన్న టీషర్టు ధరించిన వ్యక్తి ప్రేమికులను ఓవర్టేక్ చేసి వెళతాడు.
చివరగా ఐ లవ్ యూ.. అనే అర్థం వచ్చేలా మూడు వాహనాల్లో ఉన్న వారు ప్రేమికులకు కనపడేలా ఒక్కటవుతారు. ఇంతలో మరో బైకులో ఉన్న వారు ప్రేమికుల సమీపానికి వెళ్లి.. వారి చేతికి పూలబొకేను అందజేస్తారు. అనంతరం వారి వాహనాన్ని రోడ్డు పక్కగా ఆపి కిందకు దించేస్తారు. అందరి సమక్షంలో ప్రియుడు పూలబొకేను అందించి ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేస్తాడు. చుట్టూ ఉన్న స్నేహితులు రంగు రంగు కాగితాలతో కూడిన టపాసులు పేల్చుతూ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రోడ్లపై ఇవేం పనులురా నాయనా.. అంటూ వీరి ప్రవర్తనపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.