Viral: భర్త జీతంతో కలిపి పదేళ్లలో 1500 కోట్ల రూపాయలు.. భారత్‌లో అత్యధిక శాలరీ పొందుతున్న ఈ మహిళ ఎవరంటే..!

ABN , First Publish Date - 2023-07-18T20:52:16+05:30 IST

దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల లిస్ట్‌లో ఆ దంపతులు స్థానం దక్కించుకున్నారు. భర్తకు చేదోడువాదోడుగా ఉంటూనే ఆమె కూడా వ్యాపారవేత్తగా ఎదిగింది. భర్తతో పాటూ సమానంగా వేతనం పొందుతోంది. ప్రతి ఏటా వంద కోట్లకు పైగానే జీతం తీసుకుంటున్నారు. కేవలం..

Viral: భర్త జీతంతో కలిపి పదేళ్లలో 1500 కోట్ల రూపాయలు.. భారత్‌లో అత్యధిక శాలరీ పొందుతున్న ఈ మహిళ ఎవరంటే..!

దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల లిస్ట్‌లో ఆ దంపతులు స్థానం దక్కించుకున్నారు. భర్తకు చేదోడువాదోడుగా ఉంటూనే ఆమె కూడా వ్యాపారవేత్తగా ఎదిగింది. భర్తతో పాటూ సమానంగా వేతనం పొందుతోంది. ప్రతి ఏటా వంద కోట్లకు పైగానే జీతం తీసుకుంటున్నారు. కేవలం పదేళ్ల కాలంలో భర్త జీతంతో కలిపి సుమారు రూ.1500కోట్ల రూపాయలు జీతంగా తీసుకుంది. ఇంతకీ ఈ దంపతులు ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వారు.. ఏఏ వ్యాపారాలు చేస్తున్నారు.. తదితర వివరాల్లోకి వెళితే..

దేశంలో సన్ టీవీ నెట్‌వర్క్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కళానిధి మారన్ (Kalanidhi Maran) భార్యే ఈ కావేరి కళానిధి. ప్రస్తుతం ఈమె సన్ టీవీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. కంపెనీలో ఈ కుటుంబానికి దాదాపు 75శాతం వాటా ఉంది. కళానిధి మారన్, కావేరీ కళానిధి (Kaveri Kalanidhi) దంపతులు.. దేశంతోనే అత్యధిక వేతనం పొందే ఎగ్జిక్యూటివ్‌లుగా ప్రఖ్యాతిగాంచారు. కావేరి కళానిధి.. 2012 నుంచి 2021 మధ్య కాలంలో తన భర్త జీతం, ఇతర అలవెన్సులు కలిపి సుమారు రూ.1,500కోట్లు ఆర్జించింది.

Woman: మంచి మంచి సంబంధాలు.. అన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిలవే.. ఈ యువతి అన్నిటికీ నో చెప్పి..!

kalanidhi-maran.jpg

2021లో కళానిధి మారన్.. రూ.87.50 కోట్లు జీతంగా తీసుకోగా, కావేరీ కళానిధి కూడా సమాన వేతనాన్ని పొందారు. అలాగే వీరి కూతురు కావ్య రూ.1.09కోట్లు జీతంగా తీసుకుంది. కళానిధి మారన్ కుటుంబం తమిళనాడులో (Tamil Nadu) పబ్లిషింగ్ హౌస్ వ్యాపారంతో తమ ప్రస్థానాన్ని ప్రారంభిచింది. 1990లో మారన్ తమిళంలో పూమాలై అనే మాసపత్రికను ప్రారంభించారు. అనంతరం 1993లో సన్ టీవీ నెట్‌వర్క్‪‌ను (Sun TV Network) ప్రారంభించారు. ప్రస్తుతం ఈ నెట్‌వర్క్ 33 ఛానెళ్లను కలిగి ఉంది. చానెళ్లతో పాటూ వీరికి ఇతర వ్యాపారాలు కూడా చాలా ఉన్నాయి.

Viral Video: వామ్మో! ఇదేం విచిత్రం.. నడుస్తూ వెళ్తున్న మహిళ.. ఒక్కసారిగా ఎలా స్తంభించిపోయిందంటే..

Kaveri-Kalanidhi.jpg

కర్ణాటకలోని కూర్గ్‌లోని కైకేరీ అనే ప్రాంతంలో జన్మించిన కావేరీ కళానిధి.. చెన్నైలోని యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ (University of Madras) నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. 1991లో కళానిధి మారన్‌ను వివాహం చేసుకున్నారు. మారన్.. కేంద్ర మాజీ మంత్రి మురసోలి (Former Union Minister Murasoli) మారన్ కుమారుడు.. అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి (Former Chief Minister Karunanidhi) మనవడు. కాగా, కావేరీ, మారన్ దంపతుల కుమార్తె కావ్య మారన్.. ప్రస్తుతం ఐపీఎల్ హైదరాబాద్ సన్‪రైజర్స్ (IPL Hyderabad Sunrisers) జట్టు సహ యజమానురాలిగా ఉన్నారు.

Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై రాత్రి వేళ ప్రేమికుల వింత నిర్వాకం.. యువతి ముందు అతనిలా ఎందుకు చేశాడంటూ..

Updated Date - 2023-07-18T21:08:27+05:30 IST