Viral Video: పట్టుకోవాలని చూసిన వ్యక్తికి చుక్కలు చూపించిన కొండచిలువ.. ప్రాణాల మీద ఆశలు వదులుకునే సమయంలో...

ABN , First Publish Date - 2023-07-16T21:19:02+05:30 IST

కొండచిలువలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద జంతువులను సైతం అవలీలగా మింగేస్తుంటాయి. వాటి బారిన జంతువులు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే అప్పుడప్పుడూ అదృష్టం బాగుండి.. కొన్ని జంతువులు ప్రాణాలతో..

Viral Video: పట్టుకోవాలని చూసిన వ్యక్తికి చుక్కలు చూపించిన కొండచిలువ.. ప్రాణాల మీద ఆశలు వదులుకునే సమయంలో...

కొండచిలువలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద జంతువులను సైతం అవలీలగా మింగేస్తుంటాయి. వాటి బారిన జంతువులు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే అప్పుడప్పుడూ అదృష్టం బాగుండి.. కొన్ని జంతువులు ప్రాణాలతో బయటపడుతుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి కొండచిలువతో పెట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పెద్ద కొండచిలువ రోడ్డు పక్క నుంచి గడ్డి పొదల్లోకి వెళ్తుంటుంది. దాన్ని చూసిన వ్యక్తి.. పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో కొండచిలువ ఒక్కసారిగా ఆ వ్యక్తి పైకి (Python attack on young man) దాడికి దిగుతుంది. దాన్నుంచి తప్పించుకునే క్రమంలో ఆ వ్యక్తి కొండచిలువ తలను గట్టిగా పట్టుకుంటాడు. అయినా కొండచిలువ మాత్రం అతడిని చుట్టేసేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో ఊపిరి ఆడక అతను చాలా ఇబ్బంది పడతాడు.

Viral Video: ఎందుకొచ్చిన పెళ్లిరా అంటూ తల పట్టుకున్న వధూవరులు... భోజన సమయంలో యువకుల నిర్వాకంతో..

కొండచిలువ నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం అనుకునే సమయంలో అక్కడే ఉన్న వారంతా అలెర్ట్ అవుతారు. వెంటనే అక్కడికి వెళ్లి అతన్ని కాపాడతారు. ఆ ప్రాంతంలో కొండచిలువ సంచరిస్తోందని స్థానికులు సమాచారం అందించడంతో.. రెస్క్యూ టీం వెళ్లింది. ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అని కొందరు, ‘‘ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: ఇది నిజంగా అద్భుతమే.. ఆ ఊళ్లో అయిదేళ్లుగా ఇదే సీన్.. ఒక్కసారైనా ఈ వింతను చూద్దామని తరలి వస్తున్న జనం..!

Updated Date - 2023-07-16T21:19:02+05:30 IST