Viral Video: వామ్మో! ఇదేం విచిత్రం.. నడుస్తూ వెళ్తున్న మహిళ.. ఒక్కసారిగా ఎలా స్తంభించిపోయిందంటే..

ABN , First Publish Date - 2023-07-18T18:08:07+05:30 IST

కొన్నిసార్లు ఎలాంటి కారణాలు లేకుండానే.. ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సమయాల్లో మన కళ్లను మనమే నమ్మలేని విధంగా అనిపిస్తుంటుంది. మరికొన్నిసార్లు ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలీని సందిగ్ధ పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇలాంటి..

Viral Video: వామ్మో! ఇదేం విచిత్రం.. నడుస్తూ వెళ్తున్న మహిళ.. ఒక్కసారిగా ఎలా స్తంభించిపోయిందంటే..

కొన్నిసార్లు ఎలాంటి కారణాలు లేకుండానే.. ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సమయాల్లో మన కళ్లను మనమే నమ్మలేని విధంగా అనిపిస్తుంటుంది. మరికొన్నిసార్లు ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలీని సందిగ్ధ పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ నడుస్తూ వెళ్తుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

యూకేకి (UK) చెందిన ఓ మహిళకు సంబంధించిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. గుర్తుతెలియని ఓ మహిళ రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తుంటుంది. అయితే కాస్త దూరం వెళ్లాక.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. నడుస్తున్న మహిళ ఒక్కసారిగా (woman froze while walking) స్తంభించిపోతుంది. కొన్ని క్షణాల పాటు విగ్రహంలా నిలబడిపోతుంది. తర్వాత యథావిధిగా మళ్లీ నడుచుకుంటూ వెళ్తుంది. ఈ ఘటనతో అక్కడే ఉన్న వారు ఒక్కసారిగా షాక్ అవుతారు.

Viral Video: హెలీకాఫ్టర్ ఎగురుతున్న సమయంలో సెల్ఫీ కోసం వెళ్లిన యువకుడు.. అయితే సడన్‌గా చోటు చేసుకున్న ఊహించని ఘటనతో..

అక్కడున్న వారంతా... ‘‘అరె! ఇదేం విచిత్రం.. ఎందుకు ఇలా జరిగింది’’.. అంటూ చర్చించుకుంటారు. ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘మంచు దెబ్బకు గడ్డ కట్టిందేమో’’.. అని కొందరు, ‘‘వామ్మో! ఈమెకు మాయలు, మంత్రాలేమీ రావుగా’’.. అంటూ మరికొందరు, ‘‘ఇది మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై రాత్రి వేళ ప్రేమికుల వింత నిర్వాకం.. యువతి ముందు అతనిలా ఎందుకు చేశాడంటూ..

Updated Date - 2023-07-18T18:09:20+05:30 IST