Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై రాత్రి వేళ ప్రేమికుల వింత నిర్వాకం.. యువతి ముందు అతనిలా ఎందుకు చేశాడంటూ..

ABN , First Publish Date - 2023-07-18T15:19:40+05:30 IST

ప్రేమలో ఉన్న యువతీయువకులు.. కొన్నిసార్లు ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. కొందరైతే బహింరగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. మరికొందరు రోడ్లనపై బైకుల్లో ముద్దులు పెట్టుకుంటూ అంతా అసహ్యించుకునేలా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల ఇలాంటి..

Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై రాత్రి వేళ ప్రేమికుల వింత నిర్వాకం.. యువతి ముందు అతనిలా ఎందుకు చేశాడంటూ..

ప్రేమలో ఉన్న యువతీయువకులు.. కొన్నిసార్లు ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. కొందరైతే బహింరగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. మరికొందరు రోడ్లనపై బైకుల్లో ముద్దులు పెట్టుకుంటూ అంతా అసహ్యించుకునేలా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై రాత్రి వేళ ప్రేమికుల నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. యువతి ముందు యువకుడు ఎందుకు ఇలా చేశాడంటూ చర్చించుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ ప్రేమ జంట (lovers) రాత్రి సమయంలో రైల్వే ప్లాట్‌ఫామ్‌ (Railway platform) మెట్లపై కూర్చుని ఉంటారు. అంతలో వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. యువతికి ఒక్కసారిగా (Young woman anger on her boyfriend) కోపం వస్తుంది. దీంతో ఆమెను శాంతింపజేసేందుకు యువకుడు వివిధ రకాలుగా ప్రయత్నిస్తాడు. అయినా ఆమె కోపం చల్లారకపోవడంతో చివరకు మెట్లు దిగి కిందకు వచ్చి.. క్షమించమంటూ గుంజీలు (situps) తీస్తాడు.

Viral: ఇది నిజంగా అద్భుతమే.. ఆ ఊళ్లో అయిదేళ్లుగా ఇదే సీన్.. ఒక్కసారైనా ఈ వింతను చూద్దామని తరలి వస్తున్న జనం..!

ఆమె కోపం తగ్గేవరకూ గుంజీలు తీసిన తర్వాత ఆమె వద్దకు వెళ్లి.. నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాడు. వీరిని దూరం నుంచి గమనించిన ఓ వ్యక్తి.. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ హల్‍‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడిది నిజమైన ప్రేమ’’.. అంటూ కొందరు, ‘‘ప్రేయసి ఏ శిక్ష వేసినా ప్రియుడు సంతోషంగా స్వీకరిస్తాడు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 69వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎందుకొచ్చిన పెళ్లిరా అంటూ తల పట్టుకున్న వధూవరులు... భోజన సమయంలో యువకుల నిర్వాకంతో..

Updated Date - 2023-07-18T15:19:40+05:30 IST