పారిపోవాలనుకున్నాడు.. కానీ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.. భార్యను చంపి శవాన్ని మాయం చేయాలని పక్కా ప్లాన్ వేశాడు కానీ..
ABN , First Publish Date - 2023-03-08T20:29:03+05:30 IST
సంతోషంగా ఉన్న ఆ దంపతుల మధ్య వివాహేతర సంబంధం.. వివాదానికి దారి తీసింది. భార్యకు తెలీకుండా పరాయి మహిళతో ప్రేమాయణం సాగించాడు. కొన్ని రోజులు దాచి పెట్టినా చివరకు ఈ విషయం భార్యకు తెలిసింది. అప్పటి నుంచి..
సంతోషంగా ఉన్న ఆ దంపతుల మధ్య వివాహేతర సంబంధం.. వివాదానికి దారి తీసింది. భార్యకు తెలీకుండా పరాయి మహిళతో ప్రేమాయణం సాగించాడు. కొన్ని రోజులు దాచి పెట్టినా చివరకు ఈ విషయం భార్యకు తెలిసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఇటీవల చోటు చేసుకున్న అనూహ్య ఘటనతో భార్యపై మరింత కోపం పెంచుకున్నాడు. ఆమెను చంపి శవాన్ని కూడా మాయం చేయాలని పక్కా ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో పారిపోవాలనుకుని చివరకు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బీహార్ (Bihar) బంకాలోని బరాహత్ పరిధి సుధాకోల్ మహుదీహ్ ప్రాంతానికి చెందిన సంజయ్ దాస్.. భార్య శిల్పితో కలిసి నివాసం ఉంటున్నాడు. వివాహమైన మొదట్లో సక్రమంగా ఉన్న సంజయ్.. రాను రాను పరాయి మహిళలపై ఆశపడ్డాడు. ఈ క్రమంలో అతడికి వరసకు మరదలు అయ్యే మహిళతో వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. అప్పటి నుంచి భార్యకు తెలీకుండా ఆమెను కలుస్తూ ఉండేవాడు. ఈ విషయం కొన్నాళ్లకు భార్యకు తెలిసింది. అప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు (Quarrels between couples) జరుగుతూ ఉండేవి. ఈ గొడవలు ఇటీవల ఇంకా ఎక్కువయ్యాయి. ఎలాగైనా తన భర్త వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాలని శిల్పి ప్రయత్నిస్తూ ఉండేది. అయితే ఆమెకు సరైన ఆధారాలు లభించలేదు. ఈ క్రమంలో శనివారం రాత్రి సంజయ్ తన ప్రియురాలి గదిలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న శిల్పి.. అర్ధరాత్రి సడన్‌గా లోపలికి వెళ్లింది. భర్తను గట్టిగా నిలదీయడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
భార్యను తండ్రి గదిలోకి పంపించాలని భర్త ప్రయత్నం.. ఓ రోజు ఇదే విషయాన్ని ఆమెకు చెప్పి.. చివరకు..
తన బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో వెంటనే భార్యపై విచక్షణారహితంగా (Assault on wife) దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి (died) చెందింది. కేసు తన మీదకు రాకుండా ఉండేందుకు ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు. ముందుగా ఉరి వేయాలని చూసినా.. అది సాధ్యం కాలేదు. తర్వాత మృతదేహాన్ని స్కూటీపై పెట్టుకుని ఎక్కడైనా పడేసి రావాలని అనుకున్నాడు. బండిలో భార్య మృతదేహాన్ని తీసుకెళ్తుండగా.. స్థానికులు గుర్తించి పట్టుకుని దాడి చేశారు. చివరకు వారి నుంచి విడిపించుకుని, పోలీస్ స్టేషన్‌లోకి పరుగులు తీసి లోంగిపోయాడు. పోలీసులు సంజయ్‌తో పాటూ అతడి మేనల్లుడు సుజల్ దాస్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టుమార్టం (Postmortem) నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళ మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.