SBI: ఎస్బీఐలో అకౌంట్ ఉన్నవాళ్లకు కూడా ఈ విషయం తెలిసి ఉండదు.. ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించే స్కీమ్..!

ABN , First Publish Date - 2023-06-16T12:47:15+05:30 IST

మీరు ఏదైనా బిజినెస్ చేసే ఆలోచనలో ఉన్నారా? అది కూడా ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే, ఈ వార్త మీ కోసమే.

SBI: ఎస్బీఐలో అకౌంట్ ఉన్నవాళ్లకు కూడా ఈ విషయం తెలిసి ఉండదు.. ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించే స్కీమ్..!

SBI: మీరు ఏదైనా బిజినెస్ చేసే ఆలోచనలో ఉన్నారా? అది కూడా ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే, ఈ వార్త మీ కోసమే. అది కూడా అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో (SBI) కలిసి బిజినెస్ చేసే అవకాశం. అవును మీరు విన్నది నిజమే. అసలు ఇలాంటి ఓ స్కీమ్ ఉందని ఎస్బీఐలో అకౌంట్ ఉన్నవాళ్లకు కూడా తెలిసి ఉండదు. ఇక ఈ వ్యాపారం ప్రారంభించేందుకు మీకు భారీ మొత్తంలో నగదు గానీ, పెద్దగా చోటు గానీ అవసరం లేదు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి? ఏకంగా ఎస్బీఐతో కలిసి పనిచేసే ఆ స్కీమ్ ఏంటి? తదితర వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ ఏటీఏం కేంద్రాల ఏర్పాటు కోసం వేర్వేరు కంపెనీలతో కాంట్రాక్ట్ చేసుకుంటాయి. టాటా ఇండిక్యాష్ (Tata Indicash), ముత్తూట్ ఏటీఎం(Muthoot ATM), ఇండియా వన్ ఏటీఎం (India One ATM) వంటి కంపెనీలు ఇలా బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం సెంటర్స్‌ను ఏర్పాటు చేసే పని చేస్తుంటాయి. ఇక ఎస్బీఐ ఎక్కువగా తన ఏటీఎం కేంద్రాల ఏర్పాటు చేసే పనిని టాటా ఇండిక్యాష్‌కు ఇస్తుంటుంది. ఒకవేళ మీరు ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజీ ఏర్పాటు చేయాలనుకుంటే ఈ కంపెనీని సంప్రదిస్తే సరిపోతుంది.

Viral Video: చిన్నారీ.. నీకు హ్యాట్సాఫ్ తల్లీ.. ఓ కాలు లేకున్నా పరుగు పోటీల బరిలోకి దిగి.. ఓడిపోయానని తెలిసినా కూడా..!

ఏటీఎం ఫ్రాంచైజీ ఏర్పాటు కోసం ఏం చేయాలంటే..?

* ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజీ ఏర్పాటు కోసం మొదట ఇండిక్యాష్ అధికారిక వెబ్‌సైట్ www.indicash.co.in కి వెళ్లాలి.

* ఇక్కడ హోంపేజీలో ఏటీఎం ఫ్రాంచైజ్ (ATM Franchise) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో ఏటీఎం ఫ్రాంచైజీ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు కనిపిస్తాయి.

* ఈ పేజీలోనే మనకు ఏటీఎం ఫ్రాంచైజీ తీసుకోవడానికి నింపాల్సిన ఒక ఆప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. దానిలో వివరాలన్నీ నింపిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది.

ఏటీఎం ఫ్రాంచైజీ తీసుకోవడానికి అసలేంత ఖర్చు అవుతుంది..?

ఏటీఎం ఫ్రాంచైజీ తీసుకోవడానికి టాటా ఇండిక్యాష్ కంపెనీ రూ. 5లక్షలు తీసుకుంటుంది. ఇందులో రూ.2లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. అది కూడా రింఫడబుల్. ఇక మూడు లక్షలు వర్కింగ్ క్యాపిటల్‌ కింద ఇవ్వాలి.

Woman: బాత్రూంకు వెళ్తే మూత్రంతో పాటు బయటకొచ్చిన దూది ఉండలు.. భయంతో ఆస్పత్రికి వెళ్తే వెలుగులోకి అసలు నిజం..!

ఏటీఎం ఫ్రాంచైజీని తీసుకోవడానికి షరతులు ఏమిటి?

ఇక ఏటీఎం ఫ్రాంచైజీని ఇవ్వడానికి కొన్ని షరతులు కూడా ఉన్నాయి. వాటిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీరు దాన్ని పొందుతారు. అవేంటంటే..

* మీకు ఏటీఎం ఫ్రాంచైజీ కావాలంటే, మీకు తప్పనిసరిగా 80 చదరపు అడుగుల స్థలం ఉండాలి. జనం వచ్చి వెళ్లే, జనం ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఈ భూమి ఉండాలి.

* ఈ ప్రాంతం చుట్టూ ఇతర కంపెనీల ఏటీఎంలు కూడా ఉండాలి.

* ఏటీఎం కేంద్రం ఏర్పాటు చేసే చోట 24 గంటల పాటు విద్యుత్ సరఫరా తప్పనిసరి. అలాగే వీ-శ్యాట్ (V-SAT) ఇన్‌స్టాల్ చేయడానికి సొసైటీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందాల్సి ఉంటుంది.

ఏటీఎం ఫ్రాంచైజీ కోసం కావాల్సిన ధృవపత్రాలివే..

ఏటీఎం ఫ్రాంచైజీకి ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఎలక్ట్రిసిటీ బిల్లు, బ్యాంక్ పాస్‌బుక్ అవసరం. అంతే కాకుండా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, జీఎస్టీ నంబర్‌ను కూడా కలిగి ఉండాలి.

అసలు ఈ ఏటీఎం ఫ్రాంచైజీ పెద్ద మొత్తంలో డబ్బు ఎలా సంపాదించి పెడుతుందంటే..

అంతా బాగానే ఉంది. అసలు ఈ ఏటీఎం ఫ్రాంచైజీ ద్వారా సంపాదన ఎలా వస్తుంది. ఇది అతిపెద్ద ప్రశ్న. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఏటీఎం (ATM) ఫ్రాంచైజీని తీసుకునే వ్యక్తికి ప్రతి నగదు లావాదేవీకి రూ. 8, నగదు రహిత లావాదేవీలకు రూ. 2 చెల్లిస్తుంది. ఒక వ్యక్తి మీ ఫ్రాంచైజీ ఏటీఎం నుండి డబ్బు విత్‌డ్రా చేస్తే, అతని ప్రతి లావాదేవీపై రూ.8 వస్తాయి. ఒకవేళ అతను బ్యాలెన్స్‌ని మాత్రమే తనిఖీ చేసినా లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను తీసుకున్నట్లయితే అది నగదు రహిత లావాదేవీల కేటగిరీలో వస్తుంది. అప్పుడు రూ.2 పొందుతారు. ఇలా మీరు ఏర్పాటు చేసే ఏటీఎం కేంద్రంలో జరిగే లావాదేవీల ద్వారా ఇంట్లోనే కూర్చునే డబ్బు సంపాదించవచ్చు.

Gas Cylinder: గ్యాస్ సిలిండర్‌లో ఇంకెంత గ్యాస్ ఉంది..? రూపాయి కూడా ఖర్చు లేకుండా ఒక్క నిమిషంలో ఇలా కనిపెట్టొచ్చు..!

Updated Date - 2023-06-17T08:26:49+05:30 IST