Israel Youth: భారత్‌లో మినీ ఇజ్రాయెల్ ఎక్కడుందో తెలుసా..? ఇజ్రాయేలీ యూత్ అంతా ఈ సిటికీ ఎందుకు క్యూ కడుతుంటారంటే..!
ABN , First Publish Date - 2023-10-17T15:53:35+05:30 IST
ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య పది రోజులుగా జరుగుతన్న భీకర యుద్ధంపై యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు వివిధ దేశాల్లో స్థిరపడిన ఇజ్రాయెల్ వాసులు తమః బంధువులు, సన్నిహితులు, స్నేహితుల యోగక్షేమాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో...
ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య పది రోజులుగా జరుగుతన్న భీకర యుద్ధంపై యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు వివిధ దేశాల్లో స్థిరపడిన ఇజ్రాయెల్ వాసులు తమః బంధువులు, సన్నిహితులు, స్నేహితుల యోగక్షేమాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధం పైనే చర్చ నడుస్తోంది. ఇలాంటి ప్రస్తుత తరుణంలో భారత్‌లో మినీ ఇజ్రాయెల్ గురించి నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ మినీ ఇజ్రాయెల్ భారత్‌లో ఎక్కడుంది, ఇజ్రాయేలీ యూత్ అంతా ఈ సిటికీ ఎందుకు క్యూ కడుతున్నారు.. తదితర వివరాలను తెలుసుకుందాం..
దేశంలోని అత్యంత సుందరమైన ప్రదేశాలలో హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ఒకటనే విషయం తెలిసిందే. ఇక్కడ ఏ ప్రాంతానికి వెళ్లినా పర్యాటక ప్రదేశంలాగానే దర్శనిమిస్తుంటుంది. రాష్ట్ర వింటర్ క్యాపిటల్ అయిన ధర్మశాల పరిధిలోని ధరమ్‌కోట్ (Dharamkot) ప్రాంతానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రాంతాన్ని పర్వతాల టెల్ అవీవ్ అని కూడా పిలుస్తుంటారు. ఇజ్రాయిలీలు 1990లలో ఈ గ్రామాన్ని అన్వేషించారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్‌కు చెందిన చాలా మంది యువత (Israel youth) ప్రతి ఏడాదీ ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇజ్రాయెల్‌లో ప్రతి ఒక్కరికీ ఆర్మీ శిక్షణ అనేది తప్పనిసరి. దీంతో ప్రతి ఏటా అధిక సంఖ్యలో యువకులు శిక్షల తీసుకుంటూ ఉంటారు. అలాగే శిక్షణానంతరం వారు కొన్నాళ్ల పాటు సేదతీరేందుకు ధరమ్‌కోట్ వస్తుంటారు.
ప్రతి ఏడాదీ ఇక్కడికి వచ్చే ఇజ్రాయెల్ యువకులు చాలా కాలం ఇక్కడే గడుపుతారు. ఈ ప్రాంతంలో ఖబద్ హౌస్ ఉంది. ఇక్కడ ఇజ్రాయెల్ యూదులు తమ ఇష్టదైవాన్ని ఆరాధిస్తుంటారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్‌లోని కులు పరిధిలోని కసోల్ అనే చిన్న గ్రామాన్ని కూడా మినీ ఇజ్రాయెల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలోనూ ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కువ రోజులు గడుపుతుంటారు. నివేదికల ప్రకారం కులు జిల్లాలో సుమారు 1,500 మంది ఇజ్రాయెలీలు నివసిస్తున్నారు. ధరమ్‌కోట్‌తో పాటూ ఢిల్లీలోని పహర్‌గంజ్, రాజస్థాన్‌లోని అజ్మీర్ ప్రాంతాలను కూడా సందర్శిస్తుంటారు. ఈ ప్రాంతాలలోనూ యూదుల మతపరమైన ఖబద్ హౌస్ అనే మతపరమైన స్థలం ఉంది. దీంతో ఇక్కడ కూడా వారు ప్రార్థనలు చేసుకుంటుంటారు. యూదుల నూతన సంవత్సరాన్ని కూడా ఇక్కడే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
Viral Video: మొదటిసారి ఎస్కలేటర్ ఎక్కిన మహిళలు.. మధ్యలోకి వెళ్లగానే.. ఒక్కసారిగా ఏమైందో చూడండి..