Viral Video: ఈ తల్లి ఏనుగు మనుషులకు ఏమాత్రం తీసిపోదు.. పిల్ల ఏనుగును నీటిలోకి తోయడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..
ABN , First Publish Date - 2023-10-15T17:53:44+05:30 IST
పిల్లలు మారం చేసే సమయంలో తల్లిదండ్రులు ఎలాగోలా బుజ్జగించి లాలిస్తుంటారు. అయితే కొందరు మాత్రం పిల్లల అల్లరిని భరించలేక వారిపై కోపం ప్రదర్శిస్తుంటారు. ఇంకొందరైతే.. మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. అలా చేయడం తప్పని తెలిసినా రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో..
పిల్లలు మారం చేసే సమయంలో తల్లిదండ్రులు ఎలాగోలా బుజ్జగించి లాలిస్తుంటారు. అయితే కొందరు మాత్రం పిల్లల అల్లరిని భరించలేక వారిపై కోపం ప్రదర్శిస్తుంటారు. ఇంకొందరైతే.. మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. అలా చేయడం తప్పని తెలిసినా రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు మనుషుల కంటే జంతువులే మేలని అనిపిస్తుంటుంది. అయితే తాజాగా వైరల్ వీడియోలో ఓ ఏనుగు తనకూ మనుషుల్లాగానే కోపం వస్తుంది అని నిరూపించింది. పిల్ల ఏనుగుపై కోపంతో నీటిలోకి తోసేసింది. అయితే చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ తల్లి ఏనుగు (mother elephant) తన పిల్ల ఏనుగుతో కలిసి పెద్ద తొట్టిలో ఉన్న నీటిని తాగేందుకు వెళ్తుంది. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఉన్నట్టుండి తల్లి ఏనుగుకు తన పిల్ల ఏనుగుపై (baby elephant) విపరీతమైన కోపం వస్తుంది. దీంతో కోపంగా దగ్గరికి వెళ్లి తొండంతో ఎత్తి పక్కన ఉన్న నీటి తొట్టెలో పడేస్తుంది. పిల్ల ఏనుగు కావడంతో (baby elephant fell into the water) ఈత రాక పాపం నీటిలో మునిగిపోతుంది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమయంలో మరో రెండు ఏనుగులు పరుగు పరుగున అక్కడికి వస్తాయి.
Viral Video: మొదటిసారి ఎస్కలేటర్ ఎక్కిన మహిళలు.. మధ్యలోకి వెళ్లగానే.. ఒక్కసారిగా ఏమైందో చూడండి..
కంగారుగా అక్కడికి వచ్చిన రెండు ఏనుగులు.. ‘‘ఏంటమ్మా... ఇలా చేశావ్.. మనం మనుషులం కాదు కదా.. ఇలా చేయొచ్చా’’.. అని అన్నట్లుగా.. వెంటనే నీటిలో పడ్డ ఏనుగును కాపాడే ప్రయత్నం చేస్తాయి. చివరకు ఎంతో కష్టపడి ఎలాగోలా పిల్ల ఏనుగును బయటికి తీస్తాయి. అప్పటికీ కోపం తగ్గని తల్లి ఏనుగు.. ఏమీ తెలీనట్లు దూరంగా నిలబడి ఉంటుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మనుషుల కంటే జంతువులే నయం’’.. అని కొందరు, ‘‘పిల్ల ఏనుగును కాపాడేందుకు తాపత్రయపడడం చూస్తుంటే ముచ్చటేస్తోంది’’.. అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 73వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.