Share News

Viral Video: ముద్దుగా ఉన్నాయని కుక్కల సమీపానికి వెళ్తున్నారా.. ఈ యువతి విషయంలో ఏం జరిగిందో చూస్తే షాకవుతారు..

ABN , First Publish Date - 2023-10-15T15:54:40+05:30 IST

విశ్వాసంగా ఉండే జంతువులు అనగానే మొదటగా కుక్కలే గుర్తుకొస్తాయి. యజమాని కోసం అవసరమైతే తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటాయి. అయితే కొన్ని కుక్కలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాయి. కొత్తవారిని చూడగానే ముందూ వెనుకా చూడకుండా దాడికి తెగబడుతుంటాయి. ఇలాంటి ...

Viral Video: ముద్దుగా ఉన్నాయని కుక్కల సమీపానికి వెళ్తున్నారా.. ఈ యువతి విషయంలో ఏం జరిగిందో చూస్తే షాకవుతారు..

విశ్వాసంగా ఉండే జంతువులు అనగానే మొదటగా కుక్కలే గుర్తుకొస్తాయి. యజమాని కోసం అవసరమైతే తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటాయి. అయితే కొన్ని కుక్కలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాయి. కొత్తవారిని చూడగానే ముందూ వెనుకా చూడకుండా దాడికి తెగబడుతుంటాయి. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు ప్రాణాలుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన పడుకున్న కుక్క ముద్దుగా ఉండడంతో ఓ మహిళ దగ్గరికి వెళ్లింది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) వైరల్ అవుతోంది. రోడ్డు పకక్న ఓ తెల్లటి కుక్క (dog) పడుకుని ఉంటుంది. అదే దారిలో ఓ మహిళ తన పాపను తీసుకుని గొడుగు పట్టుకుని నడుకుంటూ వెళ్తుంటుంది. కుక్కను చూడగానే ఎంతో ముద్దొచ్చి దగ్గరికి వెళ్తుంది. ఆమె పక్కన ఉన్న పాప కుక్క మీద చేయి వేసి నిమురుతుంది. అయితే అప్పటికే ఆవేశంతో ఉన్న కుక్క పాపను కాకుండా పక్కనే ఉన్న మహిళపై (Dog attack on woman) దాడికి తెగబడుతుంది. నేరుగా ఆమె మొఖాన్ని నోటితో పట్టుకుని కొరుకుతుంది. ఊహించని ఈ పరిణామానికి ఆమె విలవిల్లాడిపోతుంది.

Accident video: విధి విచిత్రమైనదంటే ఇదేనేమో.. లేకపోతే.. చూస్తుండగానే ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించగరలా..

కుక్క నుంచి తప్పించుకునే క్రమంలో రోడ్డుపై పడిపోతుంది. అయితే చివరకు అక్కడే ఉన్న వారు స్పందించి, కుక్క నుంచి మహిళను రక్షిస్తారు. కుక్క దాడిలో ఆమె మొఖానికి గాయాలవడంతో వారంతా ఆమెకు నీటితో శుభ్రం చేస్తారు. గాయం తీవ్రంగా ఉండడంతో మహిళ నొప్పిని భరించలేకపోతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వీధి కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలి’’.. అని కొందరు, ‘‘అన్ని కుక్కలూ ఒకేలా ఉంటాయనుకుంటే పొరపాటు’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి పని ఎవరూ చేయకండి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

wife: ఇలాంటి భార్య కూడా ఉంటుందా.. అర్ధరాత్రి నిద్రలేచి భర్తను చూసిన ఆమె.. కాసేపటికి ఇంటి వరండాలోకి వెళ్లి..

Updated Date - 2023-10-15T15:54:40+05:30 IST