Wife: అందం కోసం భర్త సంపాదనను కరిగించేస్తున్న భార్య.. అంతా పతి కోసమేనంటూ ప్లాస్టిక్ సర్జరీలకై కోట్లలో ఖర్చు..!
ABN , First Publish Date - 2023-08-04T21:46:04+05:30 IST
అమ్మాయిని ప్రేమలో దించేందుకు యువకులు రకరకాల డ్రస్సులతో పాటూ వారి అందానికి మరింత మెరుగులు దిద్దుకుంటూ ఉంటారు. అలాగే యువతులు కూడా పది మందిలో ప్రత్యేకంగా కనిపించేందుకు బ్యూటీఫార్లర్లకు క్యూకడుతుంటారు. అయితే వివాహమైన తర్వాత చాలా ..
అమ్మాయిని ప్రేమలో దించేందుకు యువకులు రకరకాల డ్రస్సులతో పాటూ వారి అందానికి మరింత మెరుగులు దిద్దుకుంటూ ఉంటారు. అలాగే యువతులు కూడా పది మందిలో ప్రత్యేకంగా కనిపించేందుకు బ్యూటీఫార్లర్లకు క్యూకడుతుంటారు. అయితే వివాహమైన తర్వాత చాలా మంది అందం విషయంలో పెద్దగా పట్టింపులేమీ పెట్టుకోరు. ఏళ్లు గడిచే కొద్దీ అసలు ఆ విషయం గురించి ఆలోచించడమే మానేస్తారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ మాత్రం.. ఇందుకు పూర్తి విరుద్ధమని చెప్పొచ్చు. భర్తకు అందంగా కనిపించేందుకు ఏకంగా ప్లాస్టిక్ సర్జరీలే చేయించుకుంది. ఇందుకోసం భర్త సంపాదనను కరిగిస్తూ వస్తోంది. ఎందుకిలా చేస్తున్నావని ఎవరైనా అడిగితే.. అంతా పతి కోసమేనని చెబుతోంది.
సాధారణంగా భార్యలు షాపింగ్‌ల పేరుతో వేలు ఖర్చు చేస్తేనే భర్తలు చికాకు పడుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ మహిళ తన అందం కోసం లక్షలకు లక్షలు తగలేస్తున్నా.. భర్త పల్లెత్తుమాట అనలేదు. పైగా ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాడు. లండన్‌కు (London woman) చెందిన లీలా గ్రిఫిన్ అనే 29 ఏళ్ల మహిళ.. 53 ఏళ్ల గ్రిఫిన్ అనే మిలియనీర్‌ను పెళ్లి చేసుకుంది. తనకంటే 25 ఏళ్లు పెద్దవాడైన భర్తను నిత్యం సంతోషంగా ఉంచాలని ఆమె నిర్ణయించుకుంది. ఇందుకోసం రోజూ తనకు అందంగా కనిపించాలని అనుకుంది. కేవలం మేకప్ విషయంలో మాత్రమే కాకుండా పూర్తిగా తన శరీరాన్ని కూడా మార్చాలనుకుంది. ముందుగా తన పెదాలు, మరికొన్ని అవయవాలను మార్పు చేసేందుకు ప్లాస్టిక్ సర్జరీ (Plastic surgery) చేయించుకుంది.
Death Mystery: అమ్మలూ.. బీ అలెర్ట్.. వంటింట్లో వాడే కుక్కర్ ఈ మహిళ ప్రాణాలను ఎలా తీసిందో తెలిస్తే..!
ఇందుకోసం సుమారు $9,500 (సుమారు రూ. 7.8 లక్షలు) ఖర్చు చేసింది. అయినా ఆమె సంతృప్తి చెందలేదు. తన భర్తకు మరింత అందంగా కనిపించాలనే ఉద్దేశంతో మరిన్ని శస్త్ర చికిత్సలు (Surgical treatments) చేయించుకుంది. రూ.82లక్షలతో త్వరలో మరో చికిత్స చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. భార్య ఇలా చికిత్స చేయించుకోవడంపై భర్త సంతోషం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా చికిత్స అనంతరం ఆమెకు దగ్గరుండి సపర్యలు కూడా చేస్తున్నాడు. తన గురించి ఎవరేమనుకున్నా లెక్కచేయనని, తన భర్తకు నిత్యం అందంగా కనిపిస్తూ.. తనని సంతోషపెట్టడమే తన జీవిత లక్ష్యమని చెబుతోంది. కాగా, ఈ దంపతులకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి భర్త దొరికితే.. ఏ అమ్మాయికైనా అంతకంటే ఏం కావాలి’’.. అని కొందరు, ‘‘ఆదర్శ దంపతులంటే వీరే’’.. అని ఇంకొందరు, ‘‘భర్త సంపాదన మొత్తం ఊడ్చేయదు కదా’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
Fridge-Milk: ఫ్రిడ్జ్‌లో పాలను ఎక్కడ ఉంచుతున్నారు..? తెలియక అందరూ చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే..!