Shocking Video: షాకింగ్ ఘటన.. భుజంపై చిన్నారిని ఎత్తుకుని వెళ్తున్న తండ్రిని పాయింట్ బ్లాంక్ రేంజులో కాల్చిన దుండగులు..!

ABN , First Publish Date - 2023-08-16T12:26:37+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ (Shahjahanpur) లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చిన్నారిని తన భుజంపై ఎత్తుకుని వెళ్తున్న తండ్రిని నడిరోడ్డుపై దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి పరారయ్యారు.

Shocking Video: షాకింగ్ ఘటన.. భుజంపై చిన్నారిని ఎత్తుకుని వెళ్తున్న తండ్రిని పాయింట్ బ్లాంక్ రేంజులో కాల్చిన దుండగులు..!

Shocking Video: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ (Shahjahanpur) లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చిన్నారిని తన భుజంపై ఎత్తుకుని వెళ్తున్న తండ్రిని నడిరోడ్డుపై దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి పరారయ్యారు. ఈ ఘటన తాలూకు దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో కాస్తా ఇప్పుడు బయటకు రావడంతో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన చౌక్‌ పీఎస్‌ పరిధిలోని బాబుజాయ్‌ ప్రాంతం (Babuzai Area) లో ఆదివారం అర్థరాత్రి జరిగింది. బాధితుడు 28 ఏళ్ల షోయబ్‌ తన కూతురును భుజాలపై వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా కొంతదూరం వెళ్లాక అతనికి ఎదురుగా బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిని దాటుకుని షోయబ్ కొంచెం ముందుకు వెళ్లాడు.

అలా కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఒక సాయుధుడు షోయబ్ దగ్గరగా వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్‌ (Shot At Point Blank Range) లో కాల్చాడు. దాంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇక దాడి తర్వాత మోటారు సైకిల్‌పై వేచి ఉన్న ఇద్దరితో పాటు షోయబ్‌ను కాల్చిన వ్యక్తి సంఘటనా స్థలం నుండి పారిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తపుమడుగులో పడి ఉన్న షోయబ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం బరేలీ (Bareilly) కి రిఫర్ చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. పాత గొడవల కారణంగానే బాధితుడిపై ఈ దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Viral Video: ఉబెర్ డ్రైవర్ ఐడియాకు ఫిదా అవుతున్న ప్యాసింజర్లు.. సింప్లీ సూపర్బ్ అంతే..!


Updated Date - 2023-08-16T12:27:15+05:30 IST