Emergency Alert: ఎమర్జెన్సీ అలెర్ట్ అంటూ మీకు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చిందా..? అలా ఎందుకు వచ్చిందంటే..!
ABN , First Publish Date - 2023-09-15T18:11:15+05:30 IST
మీ నంబర్ మీద లాటరీ తగిలిందంటూ కొన్నిసార్లు, బ్యాంకు ఏటీఎంలో సమస్య తలెత్తింది.. పరిష్కారం కోసం మేము చెప్పినట్లుగా చేయడంటూ మరికొన్నిసార్లు, లక్షల రూపాయల లోన్లకు మీరు అర్హులంటూ ఇంకొన్నిసార్లు.. ఫోన్‌కు మెసేజ్‌లు రావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఇలాంటి...
మీ నంబర్ మీద లాటరీ తగిలిందంటూ కొన్నిసార్లు, బ్యాంకు ఏటీఎంలో సమస్య తలెత్తింది.. పరిష్కారం కోసం మేము చెప్పినట్లుగా చేయడంటూ మరికొన్నిసార్లు, లక్షల రూపాయల లోన్లకు మీరు అర్హులంటూ ఇంకొన్నిసార్లు.. ఫోన్‌కు మెసేజ్‌లు రావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఇలాంటి మెసేజ్‌లకు స్పందించవద్దంటూ బ్యాంకు అధికారులతో పాటూ పోలీసులు కూడా తరచూ హెచ్చరిస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వ రంగ సంస్థల పేర్లతో కూడా అప్పుడప్పుడూ మెసేజ్‌లు వస్తుంటాయి. ప్రస్తుతం ఇలాంటి మెసేజ్‍కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. Emergency Alert పేరుతో ప్రభుత్వం నుంచి ఇలాంటి మెసేజ్ ఎందుకు వచ్చిందంటే...
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. చాలా మందికి శుక్రవారం ఓ మెసేజ్ వచ్చింది. బీప్ శబ్ధంతో Emergency Alert అంటూ మెసేజ్ రావడంతో చాలా మంది తమ ఫోన్లు హ్యాక్ అయ్యాయేమో అని భమపడ్డారు. తమకు వచ్చిన మెసేజ్ స్క్రీన్ షాట్‌లు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఇదే మెసేజ్ చాలా మందికి రావడం చూసి హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నాకూ ఇలాగే మెసేజ్ వచ్చిందంటూ ఫొటోలను షేర్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ దీనిపై కొందరికి వివిధ రకాల సందేహాలు తలెత్తుతున్నాయి.
అయితే దీనిపై భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సిస్టమ్‌ను పరీక్షించించేందుకు.. జియో, బీఎస్ఎన్ఎల్ (Jio, BSNL) వినియోగదారులకు శుక్రవారం మధ్యాహ్న సమయంలో టెలికాం శాఖ (Telecom Department) ద్వారా ఈ మెసేజ్ వచ్చింది. అత్యవసర హెచ్చరిక వ్యవస్థ, ప్రసార వ్యవస్థ పనితీరు, ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఇలా పంపించారని తెలిసింది. కాగా, ఈ మెసేజ్‌లకు సంబంధించిన ఫొటోలు (Viral photos) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ మెసేజ్ చూసి ముందు చాలా భయపడ్డాం’’.. అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.