Viral Video: వర్షం వస్తోందని చెట్టు కిందకు వెళ్లిన మహిళలు.. కాసేపటికి అంతా చూస్తుండగా ఒక్కసారిగా ఏం జరిగిందో చూడండి..
ABN , First Publish Date - 2023-09-15T14:49:50+05:30 IST
వర్షం కురుస్తున్న సయమంలో చాలా మంది ఆ వాతావారణాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ దాని మాటున కొన్నిసార్లు ప్రమాదం కూడా పొంచి ఉంటుందని మాత్రం గుర్తించరు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే సమయంలో చాలా మంది వెంటనే చెట్టు కిందకు వెళ్తుంటారు. ఇలా...
వర్షం కురుస్తున్న సయమంలో చాలా మంది ఆ వాతావారణాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ దాని మాటున కొన్నిసార్లు ప్రమాదం కూడా పొంచి ఉంటుందని మాత్రం గుర్తించరు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే సమయంలో చాలా మంది వెంటనే చెట్టు కిందకు వెళ్తుంటారు. ఇలా వెళ్లడం చాలా ప్రమాదమని తెలిసినా.. కొందరు తప్పు చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఘజియాబాద్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వర్షం వస్తుండడంతో కొందరు మహిళలు.. పరుగుపరుగున చెట్టు కిందకు వెళ్లారు. కాసేపటికి అంతా చూస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్ పరిధి ఇందిరాపురంలోని మకాన్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఈ ప్రాంతంలో వర్షం కురిసింది. అకస్మాత్తుగా పడిన వర్షంతో స్థానిక హనుమాన్ ఆలయ సమీపంలో రోడ్డుపై ఉన్న మహిళలు కొందరు.. పరుగెత్తుకుంటూ ఓ పెద్ద చెట్టు కిందకు వెళ్లారు. వారు వెళ్లిన కాసేపటికి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అంతా చూస్తుండగా ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులతో పెద్ద శబ్ధం వచ్చింది. అంతలోనే చెట్టు మీద (lightning strike) పిడుగు పడింది. దీంతో చెట్టు కింద ఉన్న వారు పరుగులు పెట్టారు. అరుపులు, కేకలతో చుట్టు పక్కల వారంతా అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చారు. తీరా వచ్చి చూసేసరికి ఓ యువతి (young woman died) అప్పటికే చనిపోయింది.
ఈ ఘటనలో మరో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో జూలైలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ గొర్రెల కాపరి మేకలు మేపుతుండగా.. భారీ వర్షం కురడవడంతో పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. కాగా, యువతిపై పడిగుపడిన ఘటన.. అక్కడే ఓ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వర్షం కురిసే సమయంలో చెట్ల కిందకు వెళ్లడం ప్రమాదకరం’’.. అని కొందరు, ‘‘అయ్యో! ఎంత ఘోరం జరిగింది’’.. ‘‘వర్షాకాలంలో ఇలాంటి తప్పులు చేయొద్దు’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.