Crime News: ఆడుకుంటున్న పిల్లల్ని ఇంట్లోకి తీసుకెళ్లి ఓ తల్లి చేసిన దారుణమిదీ.. కేకలు వినిపించడంతో స్థానికులు లోపలికి వెళ్లి చూస్తే..
ABN , First Publish Date - 2023-05-04T18:18:02+05:30 IST
ఎలాంటి సమస్యలూ లేని కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అందుకు గల కారణాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంటాయి. అలాగే కొన్నిసార్లు కొన్ని కేసులు మిస్టరీగానే మిగిలిపోతుంటాయి. తాజగా..
ఎలాంటి సమస్యలూ లేని కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అందుకు గల కారణాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంటాయి. అలాగే కొన్నిసార్లు కొన్ని కేసులు మిస్టరీగానే మిగిలిపోతుంటాయి. తాజగా, రాజస్థాన్‌లో అనుమానాస్పద కేసు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ఆడుకుంటున్న పిల్లల్ని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లింది. చివరకు ఆమె కేకలు విని అంతా పరుగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లారు. లోపలి దృశ్యం చూసి చివరకు అంతా షాక్ అయ్యారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ (Rajasthan) బార్మర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని భిలాసర్ ప్రాంతానికి చెందిన సతారామ్ అనే వ్యక్తికి.. భార్య సోనీ (30), కూతురు లలిత (3), కొడుకు మగరం (1) ఉన్నారు. సతారామ్ ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా (Private bus driver) పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఈ దంపతుల మధ్య ఎలాంటి గొడవలు లేకపోవడంతో వీరి సంసారం సవ్యంగా సాగుతూ వచ్చింది. అయితే ఏమైందో ఏమోగానీ తాజాగా వీరి కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఓ రోజు యథావిధిగా సతారామ్ డ్యూటీకి వెళ్లాడు. వీరి పిల్లలు (children) ఇంటికి సమీపంలోని పొలంలో ఆడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో సోనీ అనూహ్య నిర్ణయం తీసుకుంది.
ఆడుకుంటున్న పిల్లలను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చింది. కాసేపటికి వారిద్దరినీ వాటర్ ట్యాంక్‌లో (mother killed her children) పడేసింది. పిల్లలు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత.. తానూ ఇంట్లోకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె కేకలు విని చుట్టుపక్కల వారు పరుగెత్తుకుంటూ వచ్చారు. మంటలు ఆర్పి చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సోనీ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దంపతుల మధ్య ఇటీవల గొడవలు తలెత్తడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తల్లీ పిల్లల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
20 ఏళ్ల తర్వాత అందిన సంతానం.. ఆ భార్యాభర్తలిద్దరి సంతోషం మూడు నెలల్లోనే ఆవిరి.. ఒకే ఒక్క ఘటనతో..