Lion Attack: పాపం.. ప్రాణభయంతో అతడు పరుగులు తీస్తున్నా ఆ సింహం వదిలిపెట్టలేదు.. యజమానిపైనే ఎలా దాడి చేసిందో చూడండి..!
ABN , First Publish Date - 2023-05-03T17:32:05+05:30 IST
పులులు, సింహాలకు ఎదురుపడిన జంతువైనా, మనిషైనా తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఒక్కసారి వాటి కంటపడితే ఇక ప్రాణాల మీద వదులుకోవాల్సిందే. అయితే కొందరు జంతు ప్రేమికులు మాత్రం వాటితో కూడా స్నేహం చేస్తుంటారు. అయినా..
పులులు, సింహాలకు ఎదురుపడిన జంతువైనా, మనిషైనా తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఒక్కసారి వాటి కంటపడితే ఇక ప్రాణాల మీద వదులుకోవాల్సిందే. అయితే కొందరు జంతు ప్రేమికులు మాత్రం వాటితో కూడా స్నేహం చేస్తుంటారు. అయినా కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం ఓ కేర్ టేకర్‌పై దాడి చేసిన సింహం వీడియో సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. పాపం అతను ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నా సింహం వదల్లేదు. చివరికి యజమానిపై సింహం దాడి చూసి అంతా షాక్ అవుతున్నారు.
దక్షిణాఫ్రికాలో (South Africa) 2018లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral video) మారింది. తబాజింబిలోని ఓ జూలో (Zoo) ఈ ఘటన చోటు చేసుకుంది. జూ నిర్వాహకుడైన 67 ఏళ్ల హాడ్జ్ నిత్యం జూకు వస్తూ జంతువుల సంరక్షణకు సంబధించిన బాధ్యతలను చూసుకునేవాడు. ఈ క్రమంలో ఓ రోజు సింహం ఎన్‌క్లోజర్‌లోకి (Lion enclosure) వెళ్లాడు. ఆ సమయంలో సింహం చాలా దూరంలో ఉంటుంది. లోపలికి వెళ్లిన హాడ్జ్ అక్కడి నేలను పరిశీలిస్తుండగా.. దూరంలో ఉన్న సింహం అతన్ని గమనిస్తుంది. అప్పటికే ఆకలితో ఉన్న సింహం ఒక్కసారిగా అతడి వైపు పరుగులు తీస్తుంది. సింహం ఆవేశాన్ని గమనించిన అతను.. వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు.
అయితే ఎన్‌క్లోజర్ గేటు వద్దకు రాగానే సింహం అతడిపై దాడి (Lion attack on caretaker) చేస్తుంది. నోటితో గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి దూరంగా ఈడ్చుకెళ్తుంది. కొంచెం దూరం ఈడ్చుకెళ్లి వదిలేసి అటూ ఇటూ చూస్తుంది. అప్పటికే తీవ్ర గాయాలపాలైన హాడ్జ్.. ప్రాణభయంతో విలవిల్లాడుతుంటాడు. అయితే అంతటితో ఆగని సింహం.. అతన్ని కాలితో రక్కుతూ మరింత లోపలికి ఈడ్చుకెళ్తుంది. అయితే ఈ దాడిలో అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడతాడు. చాలా రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత పూర్తిగా కోలుకున్నాడు. కాగా, సింహం దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.