BalayyaVijayasai: బాలకృష్ణ, విజయసాయి రెడ్డి మళ్ళీ కలుస్తున్నారు, ఈసారి ఎందుకంటే...

ABN , First Publish Date - 2023-02-25T13:07:12+05:30 IST

విజయసాయి రెడ్డి (#VijayasaiReddy), నందమూరి బాలకృష్ణ (#NandamuriBalakrishna) కలుస్తున్నారు మరోసారి.

BalayyaVijayasai: బాలకృష్ణ, విజయసాయి రెడ్డి మళ్ళీ కలుస్తున్నారు, ఈసారి ఎందుకంటే...

సమాజంలో ఒకరికొకరు వృత్తి రీత్యానో, రాజకీయంగానే, లేక ఇంకో ప్రొఫెషన్ వల్లనో ఎంతటి శత్రువులు అయినా, వ్యక్తిగతానికి, బంధుత్వానికి ఆ వృత్తిని, ప్రొఫెషన్ ని వదిలి ఆ శత్రుత్వాన్ని వదిలి కలిసి చెయ్యాలి. అది శుభ పరిణామం కూడా. అటువంటిదే ఈమధ్య చూసాం. తెలుగు దేశం పార్టీ (#TDP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (#ChandrababuNaidu), వై.ఎస్.ఆర్.సి.పీ. (#YSRCP)పార్టీ కి చెందిన, పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి (#VijayasaiReddy) ఇద్దరూ కలుసుకున్నారు. కొన్ని రోజుల క్రితం యువ నటుడు, రాజకీయాల్లో అడుగుపెట్టి రాణించాలని అనుకున్న నందమూరి తారకరత్న (#NandamuriTarakaRatna) గుండెపోటు వచ్చి చనిపోవటం తో, అతను ఈ ఇద్దరు నాయకులకు బంధువు అవటం వలన, తమ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఇద్దరూ తారకరత్న కుటుంబానికి అండగా వుండి దగ్గరుండి అన్నీ కర్మలూ జరిపించారు. వారిద్దరూ ఆలా కలవటం కొంతమందికి నచ్చలేదేమో కానీ, హర్షించినవారు చాలా ఎక్కువమంది వున్నారు.

Tarakaratna-peddakarma.jpg

ఇప్పుడు మళ్ళీ అలాంటి ఇంకో కలయిక చూడబోతున్నాం. ఈసారి విజయసాయి రెడ్డి (#VijayasaiReddy), నందమూరి బాలకృష్ణ (#NandamuriBalakrishna) కలుస్తున్నారు మరోసారి. తారకరత్న పెద్ద కర్మ మార్చి 2వ (TarakaRatnaPeddaKarma) తేదీన ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ (FNCC) లో మధ్యాహ్నం 12 గంటల నుండి జరుగుతుంది అని కుటుంబ సభ్యులకు, మిత్రులకు తెలియచేసారు. అయితే ఈ కార్డులో ఇలా చేయిస్తున్న వెల్ విషర్స్ పేరులో నందమూరి బాలకృష్ణ, వేణుంబాక విజయసాయి రెడ్డి ఇద్దరి పేర్లు కలిసి ఉండటం ఆసక్తికరం. నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీన బెంగుళూరు లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చనిపోయిన సంగతి తెలిసిందే. తారకరత్న హాస్పిటల్ లో ఉన్నన్నాళ్లూ, అలాగే అతను చనిపోయిన తరువాత హైదరాబాద్ లో చెయ్యవలసిన కార్యక్రమాలు అన్నిటికీ బాలకృష్ణ స్వయంగా పూనుకొని చేసిన సంగతి కూడా అందరు చూసిందే. ఇప్పుడు పెద్ద కర్మ కూడా బాలకృష్ణ, విజయసాయిరెడ్డి లు ఇద్దరూ కలిపి చేస్తూ ఉండటం పార్టీలకు అతీతంగా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం అని చెప్పడమే. రాజకీయ విభేదాలు ఎన్ని వున్నా, తన కుటుంబం, తన మనుషుల కోసం ఇలా ఇద్దరూ కలవటం ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు.

Updated Date - 2023-02-25T13:07:15+05:30 IST