Crime: పెళ్లికి వెళ్లిన తల్లిదండ్రులు.. అక్క ఒక్కతే ఇంట్లో కనిపించడంతో 19 ఏళ్ల ఈ తమ్ముడి దారుణమిదీ.. ఇంటి యజమాని ఫోన్‌తో..!

ABN , First Publish Date - 2023-06-03T20:23:51+05:30 IST

ప్రస్తుతం చాలా మంది యువకులు దురవాట్లకు బానిసలై.. చదువును నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మరికొందరు సొంత కుటుంబ సభ్యుల పట్ల కూడా రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వ్యక్తుల గురించి తరచూ వింటూనే ఉంటాం. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పెళ్లికి వెళ్లడంతో..

Crime: పెళ్లికి వెళ్లిన తల్లిదండ్రులు.. అక్క ఒక్కతే ఇంట్లో కనిపించడంతో 19 ఏళ్ల ఈ తమ్ముడి దారుణమిదీ.. ఇంటి యజమాని ఫోన్‌తో..!
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం చాలా మంది యువకులు దురవాట్లకు బానిసలై.. చదువును నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మరికొందరు సొంత కుటుంబ సభ్యుల పట్ల కూడా రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వ్యక్తుల గురించి తరచూ వింటూనే ఉంటాం. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పెళ్లికి వెళ్లడంతో ఇంట్లో అక్కాతమ్ముడు మాత్రమే ఉన్నారు. ఈ సమయంలో 19 ఏళ్ల తమ్ముడు ఉన్నట్టుండి దారుణానికి పాల్పడ్డాడు. చివరికి ఇంటి యజమాని ఫోన్‌తో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) గోరఖ్‌పూర్ పరిధి ఎన్‍‌క్లేవ్ పార్ట్-2 ప్రాంతంలో శ్యాంసుందర్ అనే వ్యక్తి.. భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెతో కలిసి ఉంటున్నాడు. వీరిలో 19ఏళ్ల చిన్న కొడుకు ప్రియాంషు పాండే చదువులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండేవాడు. చదువుకోకుండా ఎప్పుడూ మొబైల్ (Mobile) చూసుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేసేవాడు. దీంతో తల్లిదండ్రులు తరచూ మందలిస్తూ ఉండేవారు. ఇటీవల శ్యాంసుందర్ కుమార్తె అనన్య కూడా తన సోదరుడిని మందలిస్తూ ఉండేది. దీంతో ప్రియాంషు తన అక్కపై (sister) కోపం పెంచుకుని గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో శ్యాంసుందర్ మేల 26న గోరఖ్‌పూర్‌లోని బంధువుల వివాహానికి.. తన భార్య, పెద్ద కొడుకు హిమాన్షుతో కలిసి వెళ్లాడు.

Snake Video: పామును ఇలా చేతిలో పట్టుకుని నడి వీధిలో వేషాలు వేశాడు.. ఒకే ఒక్క మిస్టేక్‌తో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

man-crime-news.jpg

ఆ సమయంలో ఇంట్లో కూతురు అనన్య, చిన్న కొడుకు ప్రియాంషు పాండే ఉన్నారు. అయితే ఈ సమయంలో ప్రియాంషు చదువుకోకుండా మొబైల్ చూస్తూ ఉండడంతో అనన్య మందలించింది. అప్పటికే అనన్యపై కోపంగా ఉన్న ప్రియాంషు.. మరింత ఆగ్రహంతో ఆమెపై (Brother attack on sister) దాడి చేశాడు. బ్లేడుతో గొంతు కోసి ఇంటి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో ఆమె తీవ్రగాయాలపాలైంది. గమనించిన ఇంటి యజమాని ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అనన్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. యజమాని సమచారం అందించడంతో తల్లిదండ్రులు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. కూతురు మృతదేహంపై పడి బోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

Viral Video: కొంపదీసి ఆమె భర్త విడాకులు ఇస్తాడా ఏంటి..?.. పెళ్లి వేడుకలో ఈ మహిళ డాన్స్ చూసి నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

Updated Date - 2023-06-03T20:23:51+05:30 IST