Viral Video: కావాలనే బురదలోకి తలకిందులుగా దూకేసిన పిల్లాడు.. బయటకు రాలేక ఉక్కిరిబిక్కిరి.. చివరకు..!
ABN , First Publish Date - 2023-06-02T19:58:32+05:30 IST
పిల్ల చేష్టలు చూడటానికి పైకి నవ్వు తెప్పించినా.. కొన్నిసార్లు వాటి వెనుక పెద్ద ప్రమాదమే పొంచి ఉంటుంది. తెలిసీ తెలీని వయసులో కొందరు పిల్లలు ఆటలు ఆడుకునే క్రమంలో ఉన్నట్టుండి ప్రమాదాలకు గురవుతుంటారు. సరదాగా మొదలుపెట్టినా చివరికి సీరియస్ అవుతుంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో ..
పిల్ల చేష్టలు చూడటానికి పైకి నవ్వు తెప్పించినా.. కొన్నిసార్లు వాటి వెనుక పెద్ద ప్రమాదమే పొంచి ఉంటుంది. తెలిసీ తెలీని వయసులో కొందరు పిల్లలు ఆటలు ఆడుకునే క్రమంలో ఉన్నట్టుండి ప్రమాదాలకు గురవుతుంటారు. సరదాగా మొదలుపెట్టినా చివరికి సీరియస్ అవుతుంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు అదృష్టం బాగుండి ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడుతుంటారు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ పిల్లాడు కావాలనే బురదలోకి తలకిందులుగా దూకేశాడు. అయితే బయటకు రాలేక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ పిల్లాడికి సంబంధించిన వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. కొందరు పిల్లలు ఓ బురద గుంటలో ఆడుకుంటూ ఉంటారు. ఒకరిని మించి మరొకరు పోటీ పడుతూ బురదలో (Children playing in the mud) పొర్లుతూ ఉంటారు. అయితే ఈ సమయంలో ఓ బాలుడు ఓ అడుగు ముందుకేసి నీటిలో దూకినట్లుగా బురదలోకి దూకాలని ప్రయత్నిస్తాడు. తల కిందులుగా బురదలోకి దూకేశాడు. అయితే తీరా దూకిన తర్వాత తిరిగి పైకి లేవలేక ఉక్కిరిబిక్కిరి అవుతుంటాడు. ఈ సమయంలో ఎవరూ లేకపోయి ఉంటే మాత్రం ప్రాణాలకే ప్రమాదం వాటిళ్లేది. అయితే పక్కనే అతడి స్నేహితులు ఉండడంతో ఏమీ కాలేదు.
పక్కన ఉన్న మరో పిల్లాడు.. వెంటనే అక్కడికి వెళ్లి, బురదలో కూరుకుపోయిన బుడ్డోడిని పైకి లేపుతాడు. ముఖానికి అంటుకుపోయిన బురదను తొలగించడంతో ఊపిరితీసుకోవడానికి సాధ్యం అవుతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘ఇలాంటి పనులు చేసే సమయంలో పక్కన ఉన్న వాళ్ల హెచ్చరించకుండా ఏం చేస్తున్నారు’’.. అని కొందరు, ‘‘ఇలాంటి ఆటలు చాలా ప్రమాదకరం’’.. అని మరికొందరు, ‘‘బుడ్డోడి టైం బాగుంది’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.