Viral news: వామ్మో! ఒక్క నిముషం ఆలస్యం అయ్యున్నా.. బేకరీలో ఇతడు చేసిన నిర్వాకం బయటపడి ఉండేది కాదు..

ABN , First Publish Date - 2023-06-20T19:41:01+05:30 IST

కొందరు కాసుల కోసం కక్కుర్తి పడి దారుణమైన పనులు చేస్తుంటారు. ఇటీవల ఎక్కడ చూసినా ఇలాంటి దారుణాలు పెరిగిపోతూ ఉన్నాయి. మరికొందరైతే ఆఖరికి ఆహార పదార్థాల విషయంలోనూ నిర్లక్ష్యం ప్రదరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు..

Viral news: వామ్మో! ఒక్క నిముషం ఆలస్యం అయ్యున్నా.. బేకరీలో ఇతడు చేసిన నిర్వాకం బయటపడి ఉండేది కాదు..

కొందరు కాసుల కోసం కక్కుర్తి పడి దారుణమైన పనులు చేస్తుంటారు. ఇటీవల ఎక్కడ చూసినా ఇలాంటి దారుణాలు పెరిగిపోతూ ఉన్నాయి. మరికొందరైతే ఆఖరికి ఆహార పదార్థాల విషయంలోనూ నిర్లక్ష్యం ప్రదరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఈ తరహా ఘటనకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బేకరీలో ఓ వ్యక్తి చేసిన పని చూసి స్థానికులు ఖంగుతిన్నారు. ఫొటోలు, వీడియోలు తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మేఘాలయ (Meghalaya) తురా సమీపంలోని రోన్‌గ్రామ్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ బేకరీ దుకాణంపై (bakery shop) కొన్నాళ్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అయినా ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. అయితే ఇటీవల ఓ కొందరు అటుగా వెళ్తుండగా బేకరీలో దృశ్యం చూసి అవాక్కయ్యారు. దుకాణంలోని ఓ యువకుడు గడుపు తేదీ ముగిసిన బ్రెడ్‌ను ప్యాకెట్ (Expired bread packet) నుంచి తీసి, మరో కొత్త ప్యాకెట్‌లోకి మారుస్తున్నాడు. ఇలా పాత బ్రెడ్ ప్యాకెట్లను మొత్తం కొత్త ప్యాకెట్లలోకి మార్చేశాడు. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వెంటనే తమ ఫోన్లలో (Photos and videos) ఫొటోలు, వీడియోలు తీశారు.

Viral: చనిపోయిందని పోస్ట్‌మార్టం చేసేందుకు ఆస్పత్రికి తీసుకెళ్తే.. ప్రాణాలతో తిరిగొచ్చిన యువతి.. ఆ ఒక్క మాట చెప్పకపోయి ఉంటే..!

అనతంరం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు దుకాణంలో పరిశీలించారు. ఆరోపణలు రుజువు అవడంతో వెంటనే నిర్వాహకులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, బేకరీ దుకాణాన్ని సీజ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారి వల్లే.. బయటికెళ్లి ఏది తినాలన్నా భయమేస్తోంది’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: కొద్ది సెకన్లలో చనిపోబోయే పాము.. తనను తానే కాటు వేసుకుంటే.. విస్తుపోయేలా చేస్తున్న వీడియో..!

Updated Date - 2023-06-20T19:41:01+05:30 IST