Crime news: పెళ్లికుదిరిన మరదలిని బైకులో ఎక్కించుకెళ్లిన బావ.. కాసేపటికి ఫోన్ చేసి అతను చెప్పింది విని చెల్లెలు షాక్.. కంగారుగా వెళ్లి చూడగా..
ABN , First Publish Date - 2023-06-10T21:05:17+05:30 IST
ఓ వ్యక్తి సెలూన్ షాపు నడుపుతూనే అర్కెస్ర్టా కూడా నిర్వహించేవాడు. ఈ క్రమంలో అర్కెస్ర్టాలో పాటలు పాడేందుకు తన మరదలిని కూడా తీసుకెళ్లేవాడు. అయితే ఇటీవల మరదలికి వివాహం నిశ్చయమైంది. దీంతో కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. మరోవైపు ...
ఓ వ్యక్తి సెలూన్ షాపు నడుపుతూనే అర్కెస్ర్టా కూడా నిర్వహించేవాడు. ఈ క్రమంలో అర్కెస్ర్టాలో పాటలు పాడేందుకు తన మరదలిని కూడా తీసుకెళ్లేవాడు. అయితే ఇటీవల మరదలికి వివాహం నిశ్చయమైంది. దీంతో కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. మరోవైపు మరదలిని బైకులో ఎక్కించుకెళ్లిన బావ.. కాసేపటికి తన చెల్లిలికి ఫోన్ చేశాడు. ఫోన్‌లో అతడు చెప్పింది అంతా కంగారుగా వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఈ సంఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) నల్లజర్ల మండల పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. పోతినీడుపాలేనికి చెందిన వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు. అతడి అక్కాబావలు ఏలూరు జిల్లా భీమడోలులో ఉంటూ మృతి చెందారు. వారి కుమారుడు పెదపూడి సత్యనారాయణ ఒంటరి వాడు కావడంతో చేరదీసి.. ఎనిమిది నెలల క్రితం పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. సత్యనారాయణ తన మామతో కలిసి గ్రామంలో సెలూన్ షాపు (Salon shop) నిర్వహిస్తూ మరోవైపు అర్కెస్ర్టా నిర్వహిస్తున్నాడు. అర్కెస్ర్టాలో పాటలు పాడేందుకు తన మరదలిని కూడా తీసుకెళ్లేవాడు.
ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. కాగా ఇటీవల మరదలికి పెళ్లి కుదిరింది. పెళ్లయితే ఆమె తనకు దూరం అవుతుందని కోపం పెంచుకున్నాడు. తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదు అనుకుని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం రాత్రి గ్రామంలోని ఒక ఫంక్షన్‌లో పాటలు పాడడానికి వెళ్లిన మరదలిని మధ్యలో పని ఉందని బైక్‌పై ఎక్కించుకుని గ్రామ శివారులోని ఆయిల్‌ఫాం తోటలోకి తీసుకుని వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న చాకుతో గొంతుపై పలుమార్లు పొడిచాడు. మరదలు చనిపోయిందని భయపడి తన స్వగ్రామమైన భీమడోలు-కోండ్రుపాడు రైల్వే గేటు వద్దకు వెళ్లి, రైలు పట్టాలపై పడుకుని తన చెల్లెలికి ఫోన్ చేసి విషయం తెలియజేశాడు.
మరదలి మృతదేహాన్ని తెచ్చుకోమని, తాను కొండ్రుపాడు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. దీంతో చెల్లెలు పోతినీడుపాలెంలో ఉన్న బంధువులకు విషయం చెప్పడంతో గ్రామంలో ఉన్న యువకులు రాత్రి 11గంటల సమయంలో వెతగ్గా కొన ఆమె కొన ఊపిరితో కనిపించింది. దీంతో వెంటనే తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణపాయం తప్పినట్టు వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు. కాగా, ఆమె చనిపోయిందనే భయంతో సత్యనారాయణ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక సీఐ రాజు పోతినీడుపాలెంలో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.