Viral Video: చెవి నొప్పి భరించలేక ఆస్పత్రికి వెళ్లిందో మహిళ.. అక్కడున్న డాక్టర్ రెండే రెండు ఇయర్ డ్రాప్స్‌ను వేయగానే ఊహించని సీన్..!
ABN , First Publish Date - 2023-06-10T15:02:28+05:30 IST
కొందరు అరుదైన సమస్యలతో వైద్యుల వద్దకు వెళ్తుంటారు. మరికొందరు ఎన్ని ఆస్పత్రులు తిరిగినా, ఎన్ని మందులు వాడినా.. జబ్బు నయం కాక అవస్థలు పడుతుంటారు. తీరా సమస్య ఏంటా పరిశీలిస్తే.. షాకింగ్ వాస్తవాలు బయటపడుతుంటాయి. గతంలో రోగుల కడుపు నుంచి..
కొందరు అరుదైన సమస్యలతో వైద్యుల వద్దకు వెళ్తుంటారు. మరికొందరు ఎన్ని ఆస్పత్రులు తిరిగినా, ఎన్ని మందులు వాడినా.. జబ్బు నయం కాక అవస్థలు పడుతుంటారు. తీరా సమస్య ఏంటా పరిశీలిస్తే.. షాకింగ్ వాస్తవాలు బయటపడుతుంటాయి. గతంలో రోగుల కడుపు నుంచి వింత వింత వస్తువులను బయటికి తీసిన సందర్భాలను చాలా చూశాం. కొన్నిసార్లు చెవి నుంచి ఏకంగా పామును బయటికి తీసిన ఘటనలు కూడా చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ చెవి నొప్పి భరించలేక ఆస్పత్రికి వెళ్లింది. అక్కడున్న డాక్టర్ రెండే రెండు ఇయర్ డ్రాప్స్ వేయడంతో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) విపరీతమైన చెవి నొప్పితో (ear pain) ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యుడికి చెవిలో ఏదో వింత జీవి ఉన్నట్లు అనుమానం కలిగింది. దీంతో చివరకు చెవిలో రెండు ఇయర్ డ్రాప్స్ (Ear drops) వేస్తాడు. అంతే కాసేపటికే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. చెవి లోపలి నుంచి ఓ సాలె పురుగు (spider) బయటికి వస్తుంది. ఆశ్చర్యకరంగా పురుగు బతికే ఉంటుంది. చెవి లోపలి నుంచి చకచకా బయటికి వచ్చి మెడ పైకి పాకుతూ వెళ్తుంది. దాన్ని చూడగానే మహిళ ఒక్కసారిగా అవాక్కవుతుంది.
మొత్తానికి తన సమస్య పరిష్కారమవడంతో హమ్మయ్య!.. అనుకుంటూ సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మహిళ పడుకుని ఉన్న సమయంలో సాలె పురుగు చెవిలోకి వెళ్లి ఉండొచ్చని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. ‘‘వామ్మో! ఇక మీద పడుకోవాలంటేనే భయంగా ఉంది’’.. అని కొందరు, ‘‘ఇదెక్కడి వింతరా నాయనో’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటిది మేమెప్పుడూ చూడలేదు’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేలల్లో లైకులను సొంతం చేసుకుంది.