Viral: ఇది నిజంగా అద్భుతమే.. ఆ ఊళ్లో అయిదేళ్లుగా ఇదే సీన్.. ఒక్కసారైనా ఈ వింతను చూద్దామని తరలి వస్తున్న జనం..!
ABN , First Publish Date - 2023-07-15T15:54:40+05:30 IST
అప్పుడప్పుడూ చోటు చేసుకునే అరుదైన ఘటనలు.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అయితే కొన్ని ఘటనలు కళ్లతో చూసినా నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. మరికొన్నింటిని చూస్తే.. ఇదేదో మాయలా ఉందే అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన..
అప్పుడప్పుడూ చోటు చేసుకునే అరుదైన ఘటనలు.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అయితే కొన్ని ఘటనలు కళ్లతో చూసినా నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. మరికొన్నింటిని చూస్తే.. ఇదేదో మాయలా ఉందే అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఈ తరహా ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ గ్రామంలో ఐదేళ్ల క్రితం అద్భుతం జరిగింది. దీంతో ఓ సారైనా ఈ వింతను చూద్దామని జనం తరలివస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఔరయ్యా జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సదర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని గ్రామ పరిసర పొలాల్లో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి రైతులు (Farmers) చాలా మంది బోరు నీటితో పంటలను సాగు చేస్తుంటారు. అయితే ఐదేళ్ల కిందట గ్రామ సమీపంలోని ఓ బోరు బావిని (borewell) పూడ్చేశారు. తర్వాత కొన్ని నెలలకు ఆశ్చర్యకరంగా అందులో నుంచి నీళ్లు రావడం మొదలయ్యాయి. ఎలాంటి మోటారు అమర్చకుండానే నీరు రావడం చూసి రైతులు, ప్రజలు షాక్ అయ్యారు. ఒకటి కాదు రెండు కాదు ఐదేళ్లుగా అందులో నుంచి నీరు ఏకదాటిగా వస్తూనే ఉంది. దీంతో బోరుకు సమీపంలో ఓ చిన్న బావిని తవ్వించి, అందులోకి పైప్‌లైన్ వేశారు.
పారుతున్న నీరంతా వచ్చి బావిలో పడుతుంటుంది. ఈ నీరు తాగేందుకు ఎంతో రుచికరంగా ఉండడంతో స్థానికులతో పాటూ చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలంతా ఇక్కడికే వచ్చి నీరు పట్టుకెళ్తుంటారు. అలాగే యువకులు ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. నీరు ఏకదాటిగా వస్తోందన్న విషయం ఆ నోటా. ఈ నోటా పాకి అందరికీ తెలియడంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా జనం ఇక్కడికి వచ్చి చూసి వెళ్తున్నారు. ఇప్పటికీ నీరు ఎక్కడి నుంచి వస్తోందన్న విషయం ఎవరికీ తెలియలేదని గ్రామస్తులు తెలిపారు. ఈ నీరు మినరల్ వాటర్ కంటే బాగుంటుందని చెబుతున్నారు. మొత్తానికి ఈ వార్త (Viral news) ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది.
Viral Video: ఉన్నట్టుండి పొలంలోకి పెద్ద పులి వచ్చినా.. ఉలుకూ పలుకూ లేదు.. పైగా ఏమాత్రం భయం లేకుండా..