Viral Video: ఉన్నట్టుండి పొలంలోకి పెద్ద పులి వచ్చినా.. ఉలుకూ పలుకూ లేదు.. పైగా ఏమాత్రం భయం లేకుండా..
ABN , First Publish Date - 2023-07-14T20:53:18+05:30 IST
తాము విన్నది, చూసిందీ అబద్ధమని తెలుసుకున్న సందర్భాల్లో.. ‘‘అదిగో పులి.. ఇదిగో తోక’’.. అన్న సామెతను గుర్తు చేసుకోవడం అందరికీ తెలిసిందే. అయితే నిజంగా మన మధ్యకు పులులు, సింహాలు వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడీ ప్రస్తావన...
తాము విన్నది, చూసిందీ అబద్ధమని తెలుసుకున్న సందర్భాల్లో.. ‘‘అదిగో పులి.. ఇదిగో తోక’’.. అన్న సామెతను గుర్తు చేసుకోవడం అందరికీ తెలిసిందే. అయితే నిజంగా మన మధ్యకు పులులు, సింహాలు వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. తమ పొలాల్లోకి పెద్ద పులి వచ్చిందని తెలిసినా ఆ రైతులు పట్టించుకోలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) పిలిభిత్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధానంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సమయంలో ఓ పులి (Tiger viral video) వీడియో కూడా నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. వరి పొలాల్లో పనుల్లో రైతులు బిజీ బిజీగా ఉండగా.. ఓ పెద్ద పులి (tiger came into the crop field) ఎంట్రీ ఇచ్చింది. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్నట్లుగా ఎవరినీ పట్టించుకోకుండా దీనంగా నడుచుకుంటూ వెళ్తోంది. మరోవైపు రైతులు కూడా.. ‘‘ఈ పులితో మాకేంటి పని.. మా పనులు మాకు చాలా ఉన్నాయ్’’.. అన్నట్లుగా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు.
Viral Video: ఈ బుడ్డోడు భలే తెలివైనోడు.. వెనుక కూర్చున్న తమ్ముడు పొరపాటున కింద పడిపోతాడేమోనని..!
ఓ రైతు పులిని చూసి కూడా పట్టించుకోకుండా ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్నాడు. అలాగే మరికొంత మంది రైతులు (Farmers) వారి పొలం పనుల్లో తలమునకలై ఉన్నారు. పులి సంచరిస్తున్న సమీపంలో ఓ రైతు తన ఫోన్‌లో వీడియో తీశాడు. వరి పొలంలో చాలా సేపు తిరిగిన పులి.. ఎవరికీ ఎలాంటి హాని కలిగించకుండా అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘వీళ్లు పులితో సహజీవనం చేస్తున్నట్టున్నారు’’.. అని కొందరు, ‘‘సీఎం యోగి అంటే పులికి కూడా భయం ఉన్నట్టుంది’’.. అని మరికొందరు, ‘‘ఈ పులి పంట పరిశీలన బాగా చేస్తోందే’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.