Viral News: ఈ బ్యాచులర్‌ది నిజంగా చాలా గొప్ప మనసే.. 10 మంది పిల్లల తల్లితో ప్రేమ పెళ్లి..!
ABN , First Publish Date - 2023-04-29T18:13:45+05:30 IST
ఆమెకు పది మంది సంతానం. కొన్నేళ్ల కిందట భర్త చనిపోవడంతో పిల్లలను చూసుకుంటూ ఒంటరిగా జీవనం సాగించేది. ఈ క్రమంలో ఇదే ప్రాంతానికి చెందిన 40ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఎలాగైనా..
ఆమెకు పది మంది సంతానం. కొన్నేళ్ల కిందట భర్త చనిపోవడంతో పిల్లలను చూసుకుంటూ ఒంటరిగా జీవనం సాగించేది. ఈ క్రమంలో ఇదే ప్రాంతానికి చెందిన 40ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని సదరు వ్యక్తి నిర్ణయించుకున్నాడు. కొన్ని నెలల అనంతరం ఉన్నట్టుండి ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ విషయం తెలియడంతో గ్రామస్తులంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) గోరఖ్‌పూర్ పరిధి బర్హల్‌గంజ్ అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక దాద్రీ అనే గ్రామానికి చెందిన సోనీ శర్మ అనే 42 ఏళ్ల మహిళకు (woman) పది మంది పిల్లలు ఉన్నారు. వీరిలో నలుగురు కుమార్తెలు, 6మంది కుమారులు ఉన్నారు. పెద్ద కుమార్తెకు 23ఏళ్లు, చిన్న కొడుక్కి 6ఏళ్లు ఉన్నాయి. సోనీ శర్మ భర్త ఆరేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి పిల్లల సంరక్షణ బాధ్యతలు సోనీ శర్మపై పడ్డాయి. ఇదిలావుండగా, ఐదేళ్ల క్రితం డియోరియా ప్రాంతానికి చెందిన బాలేంద్ర అనే 40 ఏళ్ల వ్యక్తి పరిచయం ఏర్పడింది. బాలేంద్రకు వివాహం కాకపోవడంతో ఒంటరిగా ఉండేవాడు. ఈ క్రమలో ఇద్దరి మధ్య ప్రేమ (love) మొదలైంది. అప్పటి నుంచి ఇద్దరూ తరచూ కలుస్తూ ఉండేవారు.
Viral Video: బల్లి కరిస్తే ఏమవుతుంది..? ఈ కుర్రాడి చెవికి చివరకు ఏమైంది..?
చివరకు పెళ్లి (marriage) చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏడాది క్రితం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో సోనీ పిల్లలు అనాథలుగా మారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న బర్హల్‌గంజ్ గ్రామస్తులు.. పరారీలో ఉన్న ఇద్దరినీ ఇంటికి తీసుకొచ్చారు. స్థానిక పీజీ కళాశాల (PG College) మేనేజర్ జై ప్రకాశ్ షాహి, గ్రామ పెద్దలు కలిసి చివరకు ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ప్రజల సమక్షంలో సోని, బాలేంద్రకు ఘనంగా వివాహం జరిపించారు. జీవనోపాధి నిమిత్తం వీరిద్దరికీ తమ కళాశాలలో ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నట్లు పీజీ కళాశాల మేనేజర్ తెలిపారు. కాగా, వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో (Viral photos) వైరల్ అవుతున్నాయి. గ్రామ పెద్దలు మంచి నిర్ణయం తీసుకున్నారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.