సులభ్ కాంప్లెక్స్‌లో తుపాకీని మర్చిపోయి వెళ్లిపోయిన పోలీసు.. 15 నిమిషాల తర్వాత గుర్తుకొచ్చి తిరిగొచ్చి చూస్తే..

ABN , First Publish Date - 2023-02-14T21:26:57+05:30 IST

మతిమరుపు కారణంగా కొందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొన్నిసార్లు ఈ మతిమరుపు ప్రాణాల మీదకు తెస్తుంటుంది. సాధారణ ప్రజలకు మతిమరుపు ఉంటేనే ఇలా ఉంటే.. ఇక పోలీసులకు ఈ జబ్బు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజగా..

సులభ్ కాంప్లెక్స్‌లో తుపాకీని మర్చిపోయి వెళ్లిపోయిన పోలీసు.. 15 నిమిషాల తర్వాత గుర్తుకొచ్చి తిరిగొచ్చి చూస్తే..
ప్రతీకాత్మక చిత్రం

మతిమరుపు కారణంగా కొందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొన్నిసార్లు ఈ మతిమరుపు ప్రాణాల మీదకు తెస్తుంటుంది. సాధారణ ప్రజలకు మతిమరుపు ఉంటేనే ఇలా ఉంటే.. ఇక పోలీసులకు ఈ జబ్బు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజగా, దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ పోలీసు తన సర్వీస్ రివాల్వర్‌ని సులభ్ కాంప్లెక్స్‌లో మర్చిపోయాడు. 15 నిమిషాల తర్వాత గుర్తుకొచ్చి తిరిగి వచ్చి చూసి.. చివరకు షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే..

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఈ ఘటన చోటు చేసుకుంది. తూర్పు ఢిల్లీలోని పట్‌పర్‌గంజ్ ఇండస్ట్రియల్ ఏరియా (Industrial Area) పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఇటీవల ఓ రోజు కొందరు పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ పోలీసులు.. సులభ్ కాంప్లెక్స్‌లోని టాయిలెట్‌కు (Sulabh Complex Toilet) వెళ్లాడు. అయితే తన సర్వీస్ రివాల్వర్‌ను (Service revolver) అక్కడే మర్చిపోయి వెళ్లిపోయాడు. స్టేషన్‌కి వెళ్లిన కొద్ది సేపటికి రివాల్వర్ లేకపోవడంతో ఖంగుతిన్నాడు. ఎక్కడ పెట్టానబ్బా.. అని ఆలోచించగా.. సులభ్ కాంప్లెక్స్ విషయం గుర్తుకొచ్చింది. కొంప మునిగిందిరోయ్... అనుకుంటూ పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాడు. అయితే అక్కడ రివాల్వర్ కనిపింకపోయేటప్పటికి మరింత కంగారుపడ్డాడు.

Viral Video: కొడితే సిక్సులు.. ఫోర్లే.. వైరల్‌గా మారిన 14 ఏళ్ల బాలిక వీడియో..!

చివరకు చేసేదేమీ లేక.. స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఉన్నతాధికారులు.. రివాల్వర్‌ను (Theft of revolver) ఎత్తుకెళ్లిన దొంగ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పుడేం కొత్త కాదు. గతంలో యూపీలో కూడా ఇలాగే జరిగింది. కాన్పూర్‌లోని బిధాను ప్రాంతంలో పోలీస్ ఔట్ పోస్టులో రాత్రి వేళ నిద్రపోతున్న కానిస్టేబుల్ తుపాకీని కొందరు దొంగలు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా పోలీసులు కూడా అప్పుడప్పుడూ దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఇదే కాన్పూర్ పరిధి మహారాజ్‌పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి నిద్రపోతుండగా.. అతడి మొబైల్‌ని ఓ కానిస్టేబుల్ ఎత్తుకెళ్లాడు. తర్వాత నేరం రుజువవడంతో పోలీసును సస్పండ్ కూడా చేశారు. కాగా, ఢిల్లీ రివాల్వర్ చోరీ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

నీతో కాపురం చేయను.. పిల్లల్ని కూడా కనను.. పెళ్లయిన మర్నాడే భార్య మాటలు విని అవాక్కైన భర్త.. అసలు కథేంటంటే..

Updated Date - 2023-02-14T21:28:47+05:30 IST