Crime News: ఈ 33 ఏళ్ల కుర్రాడి గూగుల్ హిస్టరీతోనే 42 ఏళ్ల మహిళ మర్డర్ మిస్టరీ వీడింది.. ఇంతకీ ఇతడు ఫోన్లో ఏం సెర్చ్ చేశాడో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-05-18T15:46:45+05:30 IST
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని చాలా మంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. మరోవైపు ఇదే టెక్నాలజీని కొందరు తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించి చివరకు జైలు పాలవుతుంటారు. కొందరు నేరస్థులు పోలీసులకు దొరక్కుండా...
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని చాలా మంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. మరోవైపు ఇదే టెక్నాలజీని కొందరు తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించి చివరకు జైలు పాలవుతుంటారు. కొందరు నేరస్థులు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు సినిమాలు, య్యూటూబ్ వీడియోలు చూసి హత్యలకు తెగబడడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కేరళలో ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చింది. ఓ కుర్రాడి గూగుల్ హిస్టరీ ద్వారా పోలీసులు.. ఓ మహిళ మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఇంతకీ ఫోన్లో సెర్చ్ చేసి, చివరకు ఏం చేశాడంటే..
కేరళ (Kerala) కొల్లాంలోని పాలక్కాడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల ప్రశాంత్ నంబియార్ అనే వ్యక్తి మ్యూజిక్ టీచర్‌గా (Music teacher) పని చేస్తుంటాడు. ప్రశాంత్ భార్యకు బంధువైన నడువిలక్కర గ్రామానికి చెందిన 42ఏళ్ల సుచిత్ర అనే మహిళతో ఇటీవల పరిచయం ఏర్పడింది. 2019లో జరిగిన ప్రశాంత్ పిల్లల నామకరణ వేడుకలో ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. సుచిత్ర అప్పటికే ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చింది. మూడో వ్యక్తిని చేసుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. అయితే ఎలాగైనా పిల్లలు కావాలని ఆమెకు కోరిక ఉండేది. ఈ క్రమంలో ప్రశాంత్‌కు బాగా దగ్గరైంది. ఇలా వీరి మధ్య (extramarital affair) వివాహేతర సంబంధం ఏర్పడింది.
అయితే చివరకు ప్రశాంత్ ద్వారా పిల్లల్ని కనాలని సుచిత్ర కోరుకుంది. ఇదే విషయాన్ని తనతో పదే పదే చెబుతూ ఉండేది. అయితే ఇందుకు మాత్రం ప్రశాంత్ అంగీకరించేవాడు కాదు. ఒకవేళ తనతో పిలల్ని కంటే తన బండారం ఎక్కడ బయటపడుతుందో అని భయపడ్డాడు. పిల్లల విషయంలో తరచూ ఇబ్బంది పెడుతుండడంతో ప్రశాంత్ కోపం పెంచుకున్నాడు. చివరకు ఎలాగైన ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు భార్య, పిల్లలను వారి పుట్టింటికి పంపించాడు. తర్వాత మ్యూజిక్ స్కూల్‌కి కొన్నాళ్ల పాటు సెలవు పెట్టి, సుచిత్రను తీసుకుని 270కిలోమీటర్ల దూరంలోని పాలక్కాడ్‌కు తీసుకెళ్లాడు. కొన్ని రోజుల పాటు ఆమెతో కలిసి అక్కడే ఉన్నాడు.
ఆ సమయంలో ఓ రోజు రాత్రి సుచిత్రను హత్య చేశాడు. పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయంపై గూగుల్‌లో సెర్చ్ (Google search) చేసి చివరికి ఓ నిర్ణయానికి వచ్చాడు. సుచిత్ర మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఇంటి వెనుక గొయ్యి తీసి, పాతి పెట్టాడు. బయటికి తీసేందుకు వీలు లేకుండా సిమెంట్, రాళ్లతో నింపేశాడు. సుచిత్ర ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని, ఫోన్‌లో సెర్చ్ హిస్టరీ (Phone search history) పరిశీలించగా వారి అనుమానం నిజమైంది. గట్టిగా విచారించగా నేరం అంగీకరించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Viral News: ఎంతకు తెగించావురా బుడ్డోడా.. ఎలాగైనా బైక్ కొనుక్కునేందుకు తండ్రికే ఎసరు పెట్టాడు..!