Viral Video: మరీ ఇంత అతి పనికిరాదు తల్లీ.. స్కూటీపై వెళ్తూనే వెనుక కూర్చున్న ఈ యువతి ఏం చేసిందో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-05-16T20:10:16+05:30 IST
ప్రస్తుతం ఎండల ప్రభావం ఎంతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉదయం 9నుంచే సుమారు 39డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో..
ప్రస్తుతం ఎండల ప్రభావం ఎంతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉదయం 9నుంచే సుమారు 39డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో జనం శీతల పానీయాలు తీసుకుంటూ ఎండ వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. అయితే ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొందరు యువత.. ఎండ వేడిని తట్టుకునే క్రమంలో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ నెట్టింట వైరల్ అవుతున్నారు. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. స్కూటీపై వెనుక కూర్చున్న యువతి.. నడి రోడ్డుపై చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. మరీ ఇంత అతి పనికిరాదు తల్లీ.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మహారాష్ట్ర (Maharashtra) థానే పోలీస్ స్టేషన్ పరిధి ఉల్హాస్‌నగర్ సెక్టార్-17 ప్రధాన సిగ్నల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు (young man) తన స్కూటీపై యువతిని (young woman) ఎక్కించుకుని వచ్చి సిగ్నల్ వద్ద ఆగుతాడు. ఇద్దరి మధ్య పెద్ద నీళ్ల బకెట్ ఉంటుంది. ఆగిన కొద్ది సేపటికి యువతి బకెట్ నుంచి నీళ్లు తీసి, యువకుడి తలపై పోస్తుంది. అనంతరం తానూ పోసుకుంటుంది. ఇద్దరూ బైకుపైనే స్నానం చేయడం (young woman and young man bathed on scooty) చూసి పక్కన ఉన్న వాహనదారులు అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. వారికి సమీపంలోనే మరో స్కూటీపై ఉన్న యువతులు.. వారిని చూసి తెగ నవ్వుకుంటారు.
ఇంతలో గ్రీన్ సిగ్నల్ పడగానే.. ఇద్దరూ స్కూటీపై వెళ్తూనే స్నానం చేస్తారు. వెనుక కూర్చున్న యువతి బకెట్‌లో నీళ్లు ఖాళీ అయ్యే వరకూ ఇలాగే చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో వారు తలకు హెల్మెట్ కూడా ధరించరు. అలాగే ఈ యువతి చేష్టలకు పక్కన ఉన్న వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం (Viral video) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను మహారాష్ట్ర డీజీపీ, థానే పోలీసులకు ట్యాగ్ చేస్తూ షేర్ చేశారు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.