KBC Winner: 22 ఏళ్ల క్రితం కేబీసీ షోలో కోటి రూపాయలు గెలిచిన ఈ పిల్లాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-09-09T19:13:23+05:30 IST
బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించిన kaun banega crorepati (KBC) షో గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ షో గురించి ఎందుకు గుర్తు చేయాల్సి వస్తోందంటే.. 2001 లో ఈ కేబీసీ షో లో కోటి రూపాయలు గెలిచిన పిల్లాడికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ...
బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించిన kaun banega crorepati (KBC) షో గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ షో గురించి ఎందుకు గుర్తు చేయాల్సి వస్తోందంటే.. 2001 లో ఈ కేబీసీ షో లో కోటి రూపాయలు గెలిచిన పిల్లాడికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 22 ఏళ్ల క్రితం కేబీసీ షోలో కోటి రూపాయలు గెలిచిన ఈ పిల్లాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసుకుని అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ పిల్లాడు ప్రస్తుతం ఎక్కడ..? ఏం చేస్తున్నాడంటే..!
రాజస్థాన్‌లోని (Rajasthan) అల్వార్ ప్రాంతానికి చెందిన రవి మోహన్ సైనీ అనే అతను పాఠశాల విద్యను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (Visakhapatnam) నావల్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశాడు. అనంతరం 10తరగతిలో ఉండగా 2001లో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్ చేసిన KBC జూనియర్‌లో పాల్గొన్నాడు. అందులో మొత్తం 15 ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పి చివరకు రూ.కోటి గెలుచుకున్నాడు. అప్పట్లో రవి మోహన్ సైనీ.. దాదాపు ఓ సెలబ్రిటీగా మారిపోయాడు. అయితే తదనంతర కాలంలో 12వ తరగతి తర్వాత అతను వైద్య విద్యను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో మహాత్మా గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివాడు. అంత కష్టపడి ఎంబీబీఎస్ పాసైనా కూడా అతను ఇందులో కొనసాగలేదు.
విచిత్రంగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యాడు. ఈ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అతను ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఈ క్రమంలో 2012లో మొదటిసారి అతను సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యాడు. అయితే ఆ సమయంలో అతను మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. అయినా పట్టువదలకుండా 2013లో ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్‌కి ఎంపికయ్యాడు. అయినా సంతృప్తి చెందకుండా చివరగా 2014లో మరోసారి UPSC పరీక్ష రాసి.. ఆల్ ఇండియా 461వ ర్యాంక్ సాధించాడు. 2021లో రవి మోహన్ సైనీ.. గుజరాత్‌లోని (Gujarat) రాజ్‌కోట్ సిటీకి DCP - జోన్-1, ఎస్పీగా నియమించబడ్డారు. కాగా, ప్రస్తుతం రవి మోహన్ సైనీకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈయన్ను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.