Viral Video: అన్నీ రూ.500 నోట్ల కట్టలే.. దండగా కట్టుకుని మెడలో వేసుకుని.. విసిరేస్తున్నాడు.. ఎందుకిలా చేశాడంటే..!

ABN , First Publish Date - 2023-04-03T17:40:55+05:30 IST

అదొక ప్రభుత్వ ఆఫీస్. ఆయనో గ్రామ సర్పంచ్. డబ్బులు మెడలో వేసుకుని రోడ్డుపై విరజిమ్మేశాడు. ఇలా ఐదొందల నోట్లను మెడలో వేసుకుని రెండు లక్షల రూపాయలు విసిరేశాడు. చూసిన వారంతా కళ్ల అప్పగించి అలానే చూశారు. ఎవరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇంతకీ అతనికి పైసలు ఎక్కువై విసిరేశాడా? లేదంటే

Viral Video: అన్నీ రూ.500 నోట్ల కట్టలే.. దండగా కట్టుకుని మెడలో వేసుకుని.. విసిరేస్తున్నాడు.. ఎందుకిలా చేశాడంటే..!

అదొక ప్రభుత్వ ఆఫీస్. ఆయనో గ్రామ సర్పంచ్. డబ్బులు మెడలో వేసుకుని రోడ్డుపై విరజిమ్మేశాడు. ఇలా ఐదొందల నోట్లను మెడలో వేసుకుని రెండు లక్షల రూపాయలు విసిరేశాడు. చూసిన వారంతా కళ్ల అప్పగించి అలానే చూశారు. ఎవరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇంతకీ అతనికి పైసలు ఎక్కువై విసిరేశాడా? లేదంటే సరదాగా చేశాడా? తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

కరెన్సీ నోట్లు (Currency notes) వెదజల్లిన ఆ వ్యక్తి మహారాష్ట్ర (Maharashtr)లోని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ (Sarpanch). రైతులకు బావులు మంజూరు చేయడానికి ఓ అధికారి లంచం డిమాండ్ చేయడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారి తీరుకు నిరసనగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ నోట్లు (sarpanch threw) వెదజల్లాడు.

kkk.jpg

మంగేష్‌ సాబడే.. శంభాజీనగర్ జిల్లా గోవరాయ్ పయాగ్ గ్రామానికి చెందిన సర్పంచ్. ఆ గ్రామానికి 20 వ్యవసాయ బావులు మంజూరయ్యాయి. ఒక్కో బావికి రూ.4లక్షలు కేటాయించారు. వాటి పనులు ప్రారంభించాలంటూ పంచాయతీ బ్లాక్ కార్యాలయం ఆఫీసర్ జ్యోతికి విన్నవించాడు. కానీ ఆమె రైతుల నుంచి లంచం డిమాండ్ చేసింది. ఒక్కో బావికి రూ.48 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. రైతులంతా పేదవారని.. సర్పంచ్ వేడుకున్నా కనికరించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన ఆయన రూ.100, రూ.500 నోట్లను రూ.2లక్షల దండ మెడలో వేసుకుని శుక్రవారం బీడీవో కార్యాలయం ఎదుట విసిరేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం దృష్టికి చేరింది. ఈ వ్యవహారాన్ని మహారాష్ట్ర సర్కార్ ((Maharashtr Government) సీరియస్‌గా తీసుకుంది. మంత్రి గిరీష్ మహాజన్ స్పందిస్తూ ఆఫీసర్‌ను సస్పెండ్ చేసి దర్యాప్తునకు ఆదేశించారు. ఇక వెదజల్లిన డబ్బంతా పేద ప్రజల నుంచి సేకరించిందేనని.. ఆ మొత్తాన్ని బీడీవో ఆఫీసర్ నుంచి ఇప్పించాలని సర్పంచ్ మంగేష్ సాబడే కోరారు.

ఇది కూడా చదవండి: Aadhaar Card New Rules: ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై వీటిల్లో ఏ ఒక్కటి చేయాలన్నా..!

ఇది కూడా చదవండి: Blind Acting: అమ్మబాబోయ్.. స్టార్ హీరోయిన్లు కూడా ఈమె ముందు దిగదుడుపే.. ఏకంగా 15 ఏళ్ల పాటు అంధురాలిగా ఎందుకు నటించిందంటే..

ఇది కూడా చదవండి: Viral Video: ఈ అమ్మాయిలేంటి..? కాలేజీకి పప్పు కుక్కర్లు, చెత్త డబ్బాలు, బకెట్లను తీసుకొచ్చారేంటని అవాక్కవుతున్నారా..? అసలు కథేంటంటే..

Updated Date - 2023-04-03T17:46:03+05:30 IST