Share News

Same Sex Marriage: మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం.. కోర్టుకు వచ్చి మరీ బాంబు పేల్చిన ఇద్దరు యువతులు.. చివరకు..!

ABN , First Publish Date - 2023-10-17T21:46:40+05:30 IST

స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్షా చూపకూడదని, వారి హక్కులను కాపాడాలని సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించడానికి కోర్టు నిరాకరించినా.. సహజీవనం చేయడంలో మాత్రం తప్పు లేదని తెలిపింది. అయితే...

Same Sex Marriage: మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం.. కోర్టుకు వచ్చి మరీ బాంబు పేల్చిన ఇద్దరు యువతులు.. చివరకు..!
ప్రతీకాత్మక చిత్రం

స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్షా చూపకూడదని, వారి హక్కులను కాపాడాలని సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించడానికి కోర్టు నిరాకరించినా.. సహజీవనం చేయడంలో మాత్రం తప్పు లేదని తెలిపింది. అయితే వారి హక్కులను పరిరక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇదిలావుండగా, ఈ సమయంలో రాజస్థాన్‌లో ఇలాంటి విచిత్రమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. తాము పెళ్లి చేసుకోబోతున్నామంటూ ఇద్దరు యువతులు కోర్టుకు వచ్చి మరీ బాంబు పేల్చారు. చివరకు ఏం జరిగిందంటే..

రాజస్థాన్‌లోని (Rajasthan) ఉదయ్‌పూర్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అజ్మీర్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు (young women) కళాశాలలో స్నేహితులయ్యారు. ఇలా ఏర్పడ్డ వీరి పరిచయం ప్రాణ స్నేహితులుగా మార్చింది. అంతటితో ఆగకుండా జీవితాంతం కలిసే జీవించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. మరోవైపు ఇంట్లో నిత్యం చదువుకోమంటూ ఒత్తిడి చేస్తుండడంతో చివరకు పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఓ రోజు ఇంట్లో వారికి చెప్పకుండా పారిపోయి, ఝదోల్ ప్రాంత పరిధిలో ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే సంసారం పెట్టారు. పెళ్లి (marriage) చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు.

Train Video: అంకుల్ అని పిలిస్తే కాలదా ఏంటీ..? రైల్లో వెళ్తున్న ఓ కుర్రాడు అంకుల్ అని పిలవగానే ఆ వ్యక్తి రియాక్షన్ చూస్తే..!

అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చివరకు వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచారు. తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించకున్నామని కోర్టులో తెలిపారు. విచారించిన న్యాయస్థానం నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచింది. తర్వాత వారిద్దరినీ నారీ నికేతన్‌కు పంపింది. అయితే ఈ క్రమంలో యువతుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని పోలీసులతో మాట్లాడారు. వారి స్నేహానికి ఎలాంటి ఇబ్బంది కలిగించమని, వారికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలూ తీసుకోమని అధికారులకు లిఖితపూర్వకంగా రాసివ్వడంతో యువతులు వారితో ఇంటికి వెళ్లేందుకు అంగీకరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Wife-Husband: లిప్ స్టిక్ తెచ్చిన తంటా.. ఇలాంటి భర్త నాకొద్దంటూ.. పెళ్లయిన మూడు నెలలకే షాకిచ్చిన భార్య.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..!

Updated Date - 2023-10-17T21:55:37+05:30 IST