Share News

Viral Video: ఈ ఒక్క కుక్కే.. ఏకంగా 150 పిల్లులకు యజమాని.. ఇదేం విచిత్రం అని అనుకుంటున్నారా..? అసలు కథేంటంటే..!

ABN , First Publish Date - 2023-10-17T19:15:29+05:30 IST

కొందరి జీవితాన్ని పరిశీలిస్తే.. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంటుంది. మరికొందరు ఏకంగా తమ జీవితాన్నే ఇతరుల కోసం అంకితం చేస్తుంటారు. ఇలాంటి వారికి సంబంధించిన వార్తలను తరచూ వింటూ ఉంటాం. అయితే మనుషులతో పాటూ కొన్నిసార్లు జంతువులు కూడా..

Viral Video: ఈ ఒక్క కుక్కే.. ఏకంగా 150 పిల్లులకు యజమాని.. ఇదేం విచిత్రం అని అనుకుంటున్నారా..? అసలు కథేంటంటే..!

కొందరి జీవితాన్ని పరిశీలిస్తే.. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంటుంది. మరికొందరు ఏకంగా తమ జీవితాన్నే ఇతరుల కోసం అంకితం చేస్తుంటారు. ఇలాంటి వారికి సంబంధించిన వార్తలను తరచూ వింటూ ఉంటాం. అయితే మనుషులతో పాటూ కొన్నిసార్లు జంతువులు కూడా ఇలాగే చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటాయి. తాజాగా, ఈ కోవకు చెందిన ఓ కుక్క వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏకంగా 150 పిల్లులకు ఒకే కుక్క యజమానిగా మారింది. ఇదేం విచిత్రం అని అనుకుంటున్నారా..? అసలు కథేంటంటే..!

సోషల్ మీడియాలో ఓ కుక్కకు సంబంధించిన వీడియో (Dog viral video) తెగ హల్‌చల్ చేస్తోంది. ర్యాన్ అనే కుకక్ 150 కంటే ఎక్కువ పిల్లులను పెంచడంలో తన యజమానికి సాయం చేస్తోంది. లారా అనే మహిళకు ఈ కుక్క పదేళ్ల క్రితం వీధిలోని ఓ షెల్టర్‌లో కనిపించింది. అప్పటి నుంచి దీన్ని ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటోంది. లారా అంతకు ముందు నుంచే పిల్లులను పెంచుతూ ఉండేది. తర్వాత వాటి సరసన కుక్క కూడా చేరింది. అయితే ఆశ్చర్యకరంగా కుక్క కూడా వాటితో ఎంతో బాగా కలిసిపోయిది. అది ఎంతలా అంటే.. తన సొంత పిల్లలను (dog became guardian of cats) చూసుకున్నట్లే పిల్లులను కూడా చూసుకునేది.

IT Jobs Alert: నిరుద్యోగులూ.. బీ అలెర్ట్.. భారీ రిక్రూట్‌మెంట్‌కు రెడీ అవుతున్న టీసీఎస్.. ఏకంగా 40 వేల జాబ్స్..!

ఇందుకోసం కుక్కకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని లారా తెలిపింది. తనకు తానుగా పిల్లులతో కలిసిపోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పింది. పిల్లులతో కలిసిపోవడమే కాకుండా రోజూ వాటితోనే పడుకుంటుంది. అలాగే పిల్లులను ఒక చొటు నుంచి మరో చోటుకు తానే నోట కరుచుకుని మార్చేస్తుంది. లారా కూడా వీటి కోసం ఇంట్లో ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేసింది. పిల్లులతో కలిసిపోయిన కుక్క వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్! చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’’.. అని కొందరు, ‘‘ఈ కుక్కను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి’’.. అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Train Video: అంకుల్ అని పిలిస్తే కాలదా ఏంటీ..? రైల్లో వెళ్తున్న ఓ కుర్రాడు అంకుల్ అని పిలవగానే ఆ వ్యక్తి రియాక్షన్ చూస్తే..!

Updated Date - 2023-10-17T19:15:29+05:30 IST