Viral News: మెడలో కండువా.. చేతిలో ఓ పాము.. నేరుగా ఆస్పత్రికి వచ్చిన యువకుడు.. విషయం ఏంటని డాక్టర్లు అడిగితే..!
ABN , First Publish Date - 2023-05-06T15:55:39+05:30 IST
విష సర్పాలతో కొందరు వింత వింత పనులు చేయాలని చూసి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు పాములను పట్టుకుని అందరి ముందు ప్రదర్శన చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు అత్యుత్సాహంతో పాము తలపై..
విష సర్పాలతో కొందరు వింత వింత పనులు చేయాలని చూసి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు పాములను పట్టుకుని అందరి ముందు ప్రదర్శన చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు అత్యుత్సాహంతో పాము తలపై ముద్దు పెట్టడం, కొన్నిసార్లు ఏకంగా దాని తలనే నోట్లో పెట్టుకుంటూ హీరోయిజాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి పనులు చేసి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు ఎన్నో చూశాం. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు మెడలో కండువా వేసుకుని, పామును పట్టుకుని నేరుగా ఆస్పత్రికే వచ్చేశాడు. డాక్టర్ అతన్ని చూసి ఏమందని అడగ్గా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. జార్ఖండ్ (Jharkhand) పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని జైంత్గఢ్ పరిధి చంపువా సమీపంలోని బడిత గ్రామానికి చెందిన 31 ఏళ్ల కలియా అనే యువకుడికి (young man) వింత అనుభవం ఎదురైంది. సదరు యువకుడు గురువారం ఉదయం పనిలో ఉండగా.. సడన్గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చెట్ల పొదల్లోంచి ఉన్నట్టుండి వచ్చిన ఓ పాము (snake bit a young man) కలియాను కాటు వేసింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే వెంటనే తేరుకుని పామును గట్టిగా పట్టుకున్నాడు.
ఎక్కడా ఆగకుండా నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి (Government Hospital) పామును తీసుకుని వెళ్లాడు. మెడలో కండువా వేసుకుని, పామును పట్టుకుని వచ్చిన కలియాను చూసి మొదట వైద్యులకు ఏమీ అర్థం కాలేదు. అతడి వద్దకు వెళ్లి ‘‘ ఏమైంది బాబూ.. ఇలా పామును పట్టుకుని వచ్చావ్’’.. అని అడగ్గా.. కలియా అసలు విషయం చెప్పాడు. దీంతో వెంటనే అతడికి చికిత్స (treatment) చేసి, ప్రాణాపాయం నుంచి తప్పించారు. తర్వాత పామును సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.