Viral Video: నీ తెలివి ముందు ఇంజనీర్లు కూడా సరిపోరు బాసూ.. బైక్‌ను కారుగా ఎలా మార్చేశాడో చూస్తే..!
ABN , First Publish Date - 2023-08-10T18:57:42+05:30 IST
చాలా మంది తెలివి తేటలు ఉన్నా.. వాటికి పదును పెట్టడంలో మాత్రం బద్ధకిస్తుంటారు. పైగా చేయాల్సిన పనులను కూడా వాయిదా వేస్తూ కాలం వెళ్లదీస్తుంటారు. కానీ కేవలం కొద్ది మంది మాత్రం.. ఆలోచన వచ్చిందే ఆలస్యం.. వెంటనే ఆచరణలో పెట్టేస్తుంటారు. ప్రస్తుతం...
చాలా మంది తెలివి తేటలు ఉన్నా.. వాటికి పదును పెట్టడంలో మాత్రం బద్ధకిస్తుంటారు. పైగా చేయాల్సిన పనులను కూడా వాయిదా వేస్తూ కాలం వెళ్లదీస్తుంటారు. కానీ కేవలం కొద్ది మంది మాత్రం.. ఆలోచన వచ్చిందే ఆలస్యం.. వెంటనే ఆచరణలో పెట్టేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో ఇలాంటి వారు తమ ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు నెట్టింట్లోకి వదులుతున్నారు. వీటిలో కొన్ని వీడియోలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన బైకును ఏకంగా కారుగా మార్చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘నీ తెలివి ముందు ఇంజనీర్లు కూడా సరిపోరు బాసూ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన బైకును ఏకంగా (Converting bike into car) కారుగా మార్చేశాడు. అది కూడా ఏదో మార్చాం అంటే మార్చాం అన్నట్లు కాకుండా.. అచ్చం కారు లాగానే ఉండేలా తీర్చిదిద్దాడు. ఇందుకోసం బైక్‌కు కారు బాడీని ఫిట్ చేశాడు. బైకు టైర్లు కాకుండా మరోవైపు మూడో టైరును ఏర్పాటు చేశాడు. అలాగే బైకు పక్కనే మరో ఇద్దరు కూర్చునేందుకు వీలుగా సీట్లు కూడా అమర్చాడు. వెనుక నుంచి చూసినా, ముందు నుంచి చూసినా కారుకు ఏమాత్రం తీసిపోని విధంగా తయారు చేశాడు.
అలాగే వెనుక వైపు కూడా లగేజీ పెట్టుకునేందుకు స్థలం ఉండేలా డిజైన్ చేశాడు. కాస్త దూరం నుంచి చూస్తే అచ్చం కారు లాగానే కనిపిస్తుండడంతో అంతా దీన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నీ తెలివి ముందు ఇంజనీర్లు కూడా సరిపోరు బాసూ’’.. అంటూ కొందరు, ‘‘అరె! ఇదేదో భలే ఉందే’’.. అని ఇంకొందరు, ‘‘ఇలాంటి వారిని ప్రోత్సహించాలి’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.