Father: బాబోయ్.. ఇదేం ట్విస్టు.. 3 ఏళ్ల కొడుకుతో కలిసి స్కూటీపై ఓ భార్య వెళ్తోంటే.. సడన్‌గా భర్త ఎంట్రీ.. పిల్లాడిని కిడ్నాప్ చేసి..
ABN , First Publish Date - 2023-08-09T19:08:16+05:30 IST
ఒక్కగానొక్క కొడుకును చూసుకుని ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. అయితే అత్తగారింట్లో మాత్రం ఆమెకు నిత్యం వేధింపులే ఎదురయ్యాయి. అయినా కొడుకు భవిష్యత్ కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరించింది. అయితే ఇటీవల ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది..
ఒక్కగానొక్క కొడుకును చూసుకుని ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. అయితే అత్తగారింట్లో మాత్రం ఆమెకు నిత్యం వేధింపులే ఎదురయ్యాయి. అయినా కొడుకు భవిష్యత్ కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరించింది. అయితే ఇటీవల ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. తన మూడేళ్ల కొడుకును తీసుకుని స్కూటీపై వెళ్తుండగా.. సడన్‌గా వచ్చిన భర్త పిల్లాడిని కిడ్నాప్ చేశాడు. చివరకు ఏం జరిగిందంటే..
మహారాష్ట్రలోని (Maharashtra) నాగ్‌పూర్ నగరంలోని తులసి నగర్లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఖాండ్వా ప్రాంతానికి చెందిన అబ్దుల్ అలీమ్ అనే యువకుడికి, ఆక్సా ఇద్రీస్ అనే యువతితో 2019లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి మూడేళ్ల మహ్మద్ హుస్సేన్ అనే కొడుకు ఉన్నాడు. ఇదిలావుండగా, వివాహమైన కొన్ని నెలల తర్వాత ఆక్సాకు అత్తారింట్లో వేధింపులు (Harassment) మొదలయ్యాయి. భర్తతో పాటూ అత్తమామలు కూడా తరచూ ఆమెను తరచూ వేధిస్తుండేవారు.
దీంతో ఇటీవల ఆమె కొడుకును తీసుకుని నాగ్‌పూర్‌లోని తన పుట్టింటికి వచ్చింది. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. కొన్ని రోజుల క్రితం ఆమె తన భర్తకు విడాకుల నోటీసు (Divorce Notice) కూడా పంపింది. ఇదిలావుండగా, అలీమ్ అజ్మీర్‌లో మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే కొడుకును తనతో పాటూ తీసుకెళ్లాలని కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో మొదటి భార్యకు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సోమవారం ఆక్సా తన కొడుకును స్కూల్లో దింపేందుకు వెళ్తుండగా.. కారులో వెళ్లిన అలీమ్ కొడుకును బలవంతంగా (father kidnapped his son) లాక్కుని పారిపోయాడు. అంతటితో ఆగకుండా భార్యను చంపేస్తానని కూడా బెదిరించాడు. ఆక్సా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు.