Lady Constable: నా భార్య కానిస్టేబుల్ అంటూ గొప్పగా చెప్పుకునే భర్తను.. ఆమే చంపేసింది.. అసలు కథేంటంటే..!
ABN , First Publish Date - 2023-08-09T17:24:50+05:30 IST
ఇటీవల చాలా మంది మహిళల్లో కూడా నేర ప్రవృత్తి పెరిగిపోవడం రోజూ చూస్తూనే ఉన్నాం. తప్పని తెలిసి కూడా ఎంతో మంది నేరాలకు పాల్పడుతున్నారు. కొందరైతే మరీ దారుణంగా హత్యలకూ తెగబడుతున్నారు. ఇటీవల ..
ఇటీవల చాలా మంది మహిళల్లో కూడా నేర ప్రవృత్తి పెరిగిపోవడం రోజూ చూస్తూనే ఉన్నాం. తప్పని తెలిసి కూడా ఎంతో మంది నేరాలకు పాల్పడుతున్నారు. కొందరైతే మరీ దారుణంగా హత్యలకూ తెగబడుతున్నారు. ఇటీవల విశాఖపట్నంలో ఓ మహిళ.. కానిస్టేబుల్‌గా పని చేస్తున్న తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన ఉదంతం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా, రాజస్థాన్‌లో ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. నా భార్య కానిస్టేబుల్ అంటూ ఓ వ్యక్తి అందరికీ గొప్పగా చెప్పుకొనేవాడు. అయితే చివరకు భార్యే అతడిని హత్య చేసింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...
రాజస్థాన్‌లోని (Rajasthan) భరత్పూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక బన్సూర్ ప్రాంతానికి చెందిన సంజయ్ జాట్ అనే వ్యక్తికి ఇదే ప్రాంతానికి చెందిన పూనమ్ జాట్తో కొన్నేళ్ల కిందట వివాహమైంది. పూనమ్ సీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్‌గా (CRPF Constable) పని చేస్తోంది. ఆమె ప్రస్తుతం ఢిల్లీలో (Delhi) పని చేస్తుండడంతో దంపతులిద్దరూ అక్కడే కాపురం పెట్టారు. అయితే ఇటీవల పూనమ్‌కు బన్సూర్ ప్రాంతానికి చెందిన రాంప్రతాప్ గుర్జార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. రాంప్రతాప్ కూడా సీఆర్పీఎఫ్లో పని చేస్తున్నాడు. దీంతో వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్త కొన్నాళ్లకే వివాహేతర సంబంధానికి (extramarital affair) దారి తీసింది. అయితే ఇటీవల పూనమ్ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. సంజయ్ జాట్ తరచూ తన భార్యను కొడుతుండేవాడు.
ఇటీవల ప్రియుడికి ఫోన్ చేసిన పూనమ్.. తన భర్త దాడి చేసే విషయాన్ని ప్రియుడికి తెలిపింది. తర్వాత ఇద్దరూ కలిసి సంజయ్‌ని హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. జూల్ 31న రాత్రి సంజయ్‌ని హత్య చేసి, మృతదేహంతో బన్సూర్ చేరుకున్నారు. అక్కడ సంజయ్ ఇంటికి సమీపంలో పూడ్చిపెట్టారు. సాక్ష్యాలు దొరక్కుండా ఢిల్లీకి 180 కి.మీ దూరంలోని అల్వార్ జిల్లాలోని ఓ గ్రామంలో దాచేందుకు ప్రయత్నించారు. అయితే ఈలోగానే సంజయ్ తల్లిదండ్రులు.. తమ కొడుకు కనపడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పూనమ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిచంగా విషయం వెలుగులోకి వచ్చింది. తర్వాత ఆమె ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకుని, వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.