Disabled Child Video: నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో.. ఈ 5 ఏళ్ల పిల్లాడు నడిస్తే వింతేంటంటారా..? ఇతడి కథేంటో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-04-06T17:55:24+05:30 IST
పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎదిగే క్రమంలో ప్రతి క్షణం.. తల్లిదండ్రులకు అమితమైన ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది. పాకడం మొదలు.. బుడి బుడి అడుగులు వేయడం, బోసి నవ్వులు నవ్వడం, తడబడుతూ వచ్చే బుజ్జి బుజ్జి మాటలు.. ఇలా..
పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎదిగే క్రమంలో ప్రతి క్షణం.. తల్లిదండ్రులకు అమితమైన ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది. పాకడం మొదలు.. బుడి బుడి అడుగులు వేయడం, బోసి నవ్వులు నవ్వడం, తడబడుతూ వచ్చే బుజ్జి బుజ్జి మాటలు.. ఇలా ప్రతి ఘట్టాన్ని చూసి ఎంతో మురిసిపోతుంటారు. అయితే కొందరు పిల్లలు మాత్రం వివిధ రకాల సమస్యలతో ఆలస్యంగా అడుగులు వేస్తుంటారు. ప్రస్తుతం ఓ ఐదేళ్ల పిల్లాడు మొదటి సారి అడుగులు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐదేళ్ల పిల్లాడు నడవడంలో ఆశ్చర్యం ఏముందీ అనేగా మీ డౌట్. ఇతడి కథేంటో తెలిస్తే.. అయ్యో! పాపం అని మీరే అంటారు..
సోషల్ మీడియాలో ఓ ఐదేళ్ల చిన్నారికి సంబంధించిన వీడియో (Viral videos) తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా పిల్లలు ఆరు నెలల నుంచి ఏడాది లోపు నడక నేర్చుకుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పిల్లాడు ఐదేళ్లు వచ్చే వరకూ నడవలేకపోయాడు. వైకల్యంతో (disability) పుట్టడంతో ఏళ్లు గడుస్తున్నా నడవడం సాధ్యం కాలేదు. దీంతో ఆ తల్లి కొడుకు ఎప్పుడెప్పుడు నడుస్తాడా.. అని గంపెడాశతో ఎదురు చూస్తే ఉండేది. అయితే ఇటీవల ఐదేళ్లు పూర్తి చేసుకున్న బుడ్డోడు.. మెల్లగా అడుగులు వేయడం (Boy walking) మొదలెట్టాడు. కొడుకు నడవడం చూసిన తల్లి.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది.
పిల్లాడు అడుగులో అడుగు వేస్తూ సాధ్యం కాకున్నా నడిచేందుకు ప్రయత్నిస్తాడు. ఇలా అందరినీ ఆశ్చర్యపరుస్తూ తొలిసారిగా కాళ్ల మీద ముందుకు కదులుతాడు. కాసేపటి తర్వాత ఎదురుగా ఉన్న కుర్చీ మీద పడుకుని ‘‘అమ్మా! సరిగ్గానే నడిచానా’’.. అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. అప్పటికే కొడుకు నడక చూసి మురిసిపోతున్న తల్లి.. చివరగా కొడుకును అభినందిస్తుంది. నెట్టిజన్లను కట్టిపడేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘‘ఈ బుడ్డోడు అందరి పిల్లల్లా త్వరలో పరుగులు పెట్టాలి’’.. అని కొందరు, ‘‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.