Viral Videos: ఓరి నాయనో.. మెట్రో రైళ్లలో ఇన్ని కళాఖండాలా..? డ్రస్సుల నుంచి ముద్దు సీన్ల వరకు ఎన్ని నిర్వాకాలు జరిగాయో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-04-05T18:10:22+05:30 IST
మెట్రో రైళ్లలో యువతీయువకులు చేసే చిత్రవిచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొందరు యువతులైతే మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు ప్రేమికులు అందరి ముందూ ముద్దులు పెట్టుకుంటూ..
మెట్రో రైళ్లలో యువతీయువకులు చేసే చిత్రవిచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొందరు యువతులైతే మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు ప్రేమికులు అందరి ముందూ ముద్దులు పెట్టుకుంటూ దారుణంగా వ్యవహరించడం కూడా చూశాం. అలాగే కొందరు యువతులు.. పొట్టి పొట్టి డ్రస్సులతో రైలు ప్రయాణం చేస్తూ.. నెటిజన్ల ఆగ్రహానికి గురైన సందర్భాలు కూడా చాలా జరిగాయి. ఇటీవల ఢిల్లీ మెట్రో రైల్లో జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలు మరీ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు.. ఓరి నాయనో.. మెట్రో రైళ్లలో ఇన్ని కళాఖండాలా..? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Poonam Bajwa: ‘సన్ సెట్’లో సెగలు పుట్టిస్తున్న పూనమ్ బాజ్వా.. వైరల్ అవుతున్న ఫొటోలు!
సోషల్ మీడియాలో మెట్రో రైళ్లకు సంబంధించి, అందులోనూ ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు (Delhi Metro Videos) తెగ వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో ఓ ప్రేమ జంట రైలు బోగీలో ప్రయాణికుల ఎదుట మరీ దారుణంగా ప్రవర్తించడం చూసి అంతా షాక్ అయ్యారు. పక్కన జనం ఉన్నారనే స్పృహ కూడా లేకుండా ముద్దులు (Lovers kissing videos) పెట్టుకుంటారు. వీరి ప్రవర్తన చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మరో ఘటనలో ఎర్ర చీర కట్టుకున్న మహిళ (woman) మెట్రో స్టేషన్‌లో డాన్స్‌లు వేస్తుంది. ఎలాంటి బిడియం లేకుండా చిత్రవిచిత్రమైన స్టెప్పులు వేసి, అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. అదేవిధంగా ఇంకో ఘటనలో ఓ యువతి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో మెట్రో రైల్లో అర్ధనగ్నంగా ప్రయాణిస్తుంది.
ఒంటి మీద చిన్న పేలికలతో కూడిన డ్రస్సు వేసుకుని వెళ్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. యువతి ప్రవర్తనపై మండిపడుతున్నారు. ఇంకో ఘటనలో రైల్లో సీటు కోసం ఓ యువతి పక్కనే ఉన్న మహిళతో గొడవకు దిగుతుంది. బూతులు తిట్టుకుంటూ ఉన్న వీరిద్దరినీ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. అలాగే ఇధ్దరి ప్రేమికులు మెట్రో రైల్లో అందరి ముందూ గొడవ పడతారు. ప్రయాణికుల సమక్షంలో ఇద్దరి మధ్య ఏదో విషయంలో గొడవ మొదలవుతుంది. దీంతో ఆగ్రహించిన యువతి.. యువకుడిని ఫెడేల్‌మని చెంప మీద కొడుతుంది. దీంతో ఆగ్రహానికి గురైన అతను.. ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాడు. రాను రాను ఇలాంటి వారి ప్రవర్తన మితిమీరిపోతోంది.. అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఇటీవల ఇలాంటి వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి.