Husband Love Letter: ఇంటిని శుభ్రం చేస్తోంటే బయటపడ్డ ‘భర్త లవ్ లెటర్’.. 18 ఏళ్ల క్రితం నాటి ఆ లేఖను చదివి ఆ భార్య ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-04-05T20:07:19+05:30 IST

ప్రేమను వ్యక్తపరచడంలో ఒకప్పటికి, ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుత హైటెక్ యుగంలో ప్రేమను మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు.. ఇలా వివిధ రకాల పద్ధతుల ద్వారా తెలియజేయడం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకప్పుడు ప్రియురాలికి తమ ప్రేమను వ్యక్తం చేయడానికి తమలోని..

Husband Love Letter: ఇంటిని శుభ్రం చేస్తోంటే బయటపడ్డ ‘భర్త లవ్ లెటర్’.. 18 ఏళ్ల క్రితం నాటి ఆ లేఖను చదివి ఆ భార్య ఏం చేసిందంటే..

ప్రేమను వ్యక్తపరచడంలో ఒకప్పటికి, ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుత హైటెక్ యుగంలో ప్రేమను మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు.. ఇలా వివిధ రకాల పద్ధతుల ద్వారా తెలియజేయడం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకప్పుడు ప్రియురాలికి తమ ప్రేమను వ్యక్తం చేయడానికి తమలోని పాండిత్యాన్ని మొత్తం బయటికి తీసి ప్రేమ లేఖలు రాయడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఓ అడుగు ముందుకేసి.. ప్రేమ లేఖలను రక్తంతో రాస్తే, మరికొందరు ప్రియురాలిని పొగడ్తలతో ముంచెత్తుతూ లేఖలు రాస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఇంటిని శుభ్రం చేస్తున్న భార్యకు 18ఏళ్ల క్రితం భర్త రాసిన ప్రేమ లేఖ దొరికింది. దీంతో చివరకు ఆమె ఏం చేసిందంటే..

Mahesh Babu: ఓ.. అన్నా.. ఏంటీ ఈ అందం.. సూపర్ స్టార్ స్వయంగా షేర్ చేసిన ఫొటోలు.. ఫ్యాన్స్‌ ఫిదా..!


సోషల్ మీడియాలో ప్రేమ లేఖకు (love letter) సంబంధించిన వార్త వైరల్‍‌గా (Viral news) మారింది. ఓ మహిళ తన ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో పాడైపోయిన వస్తువులన్నింటీ తీసి బయటపడేస్తుండగా... ఆమెకు ఓ లేఖ కనపించింది. అది 18 ఏళ్ల క్రితం తన భర్త రాసిన ప్రేమ లేఖ అని తెలిసింది. అందులో తన భర్త.. ప్రేమను వ్యక్తం చేస్తూనే ప్రియురాలికి (girlfriend) ల్యాబ్ ప్రయోగాల (Lab experiments) గురించి డ్రాయింగ్‌ల ద్వారా వివరిస్తూ రాసుకొచ్చాడు.

VGold Facts: ఈ ప్రపంచంలో అసలు ఎన్ని టన్నుల బంగారముంది..? మొత్తం బంగారాన్ని ఒక్క చోట చేర్చి కరిగించి తీగలా మార్చితే..

ప్రేమను తెలియజేయడమే కాకుండా చదువుకు సంబంధించిన అనేక విషయాలను కూడా వివరించడం ఆమెను ఆకట్టుకుంది. ప్రియురాలికి ఇలాంటి ప్రేమ లేఖలు రాసేవాళ్లు చాలా అరుదుగా ఉంటారని సదరు మహిళ పేర్కొంది. వెంటనే ఆ ప్రేమ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరల్‌గా (Viral photos) మారింది. ఇలాంటి ప్రేమికులు చాలా అరుదుగా ఉంటారని కొందరు, ప్రేమ లేఖలో ల్యాబ్ పాఠాలు.. సూపర్.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Videos: ఓరి నాయనో.. మెట్రో రైళ్లలో ఇన్ని కళాఖండాలా..? డ్రస్సుల నుంచి ముద్దు సీన్ల వరకు ఎన్ని నిర్వాకాలు జరిగాయో మీరే చూడండి..!


Poonam Bajwa: ‘సన్ సెట్‌’లో సెగలు పుట్టిస్తున్న పూనమ్ బాజ్వా.. వైరల్ అవుతున్న ఫొటోలు!

Updated Date - 2023-04-07T11:26:12+05:30 IST