Viral Video: బాత్రూంల వద్ద యువతుల మధ్య విచిత్ర సమస్య.. చివరకు ఏం జరిగిందో చూస్తే అవాక్కవుతారు..
ABN , First Publish Date - 2023-09-01T18:03:50+05:30 IST
మహిళల మధ్య గొడవలు ఎప్పుడు ఎలా మొదలవుతాయో ఎవరికీ తెలీదు. కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకున్నా.. సృష్టించుకుని మరీ గొడవపడుతుంటారు. మరికొన్నిసార్లు మరీ చిన్న చిన్న సమస్యలకూ పెద్ద గొడవ చేసేస్తుంటారు. ఇక పక్క పక్క ఇళ్లల్లో ఉండే మహిళల విషయంలో..
మహిళల మధ్య గొడవలు ఎప్పుడు ఎలా మొదలవుతాయో ఎవరికీ తెలీదు. కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకున్నా.. సృష్టించుకుని మరీ గొడవపడుతుంటారు. మరికొన్నిసార్లు మరీ చిన్న చిన్న సమస్యలకూ పెద్ద గొడవ చేసేస్తుంటారు. ఇక పక్క పక్క ఇళ్లల్లో ఉండే మహిళల విషయంలో ఎలాంటి గొడవలు జరుగుతుంటాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, యువతుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరుగుదొడ్డి వద్ద కొందరు యువతుల మధ్య సడన్‌గా గొడవ మొదలవుతుంది. చివరకు ఏం జరిగిందంటే..
పెన్సిల్వేనియాలోని (Pennsylvania) పిట్స్‌బర్గ్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పీఎన్‌సీ పార్కులో బుధవారం రాత్రి కొందరు యువతులు (young women) తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల వద్దకు వస్తారు. అక్కడ అప్పటికే మరికొంత మంది యువతులు ఉంటారు. ముందుగా ఓ గ్రూపులోని యువతి మరుగుదొడ్డి (toilet) లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ఆమెను ఇంకో గ్రూపునకు చెందిన యువతి అడ్డుకుని డోరు మూసేస్తుంది. దీంతో కాసేపు వారిద్దరి మధ్య వాగ్వాదం (Quarrel between young women) నెలకొంటుంది. దీంతో ఆగ్రహానికి గురైన యువతి అడ్డుకుంటున్న ఆమెపై దాడికి పాల్పడుతుంది. ఈ క్రమంలో ఇద్దరూ ఇష్టమొచ్చినట్లు కొట్టుకుంటారు.
కాసేపటికి మరికొందరు యువతులు అక్కడికి రావడంతో గొడవ పెద్దది అవుతుంది. వీరి గొడవను చూసి బాత్రూంలో ఉన్న మహిళలు అక్కడి నుంచి పారిపోతారు. అప్పటికే ఆవేశంతో ఊగిపోతున్న మరో యువతి తన ప్రత్యర్థిని కాలితో తన్ని తన కోపాన్ని ప్రదర్శిస్తుంది. ఇంతలో కొందరు అక్కడికి చేరుకుని సర్దిచెప్పడంతో గొడవ సర్దుమణుగుతుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న మరికొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! వీళ్లు ఆడవారా.. వీధి రౌడీలా’’.. అని కొందరు, ‘‘ఇలాంటి చిన్న సమస్యకూ గొడవ పడడం వీరికే సాధ్యం’’.. అని మరికొందరు, ‘‘సినిమా సీన్లకు ఏమాత్రం తీసిపోనివిధంగా ఉంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఏనుగు పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. అంతెత్తున ఉన్న పనస పండ్లను ఎలా తెంచేసిందో చూడండి..