Viral Video: ఇది పానీపూరీ యుద్ధం.. ఈ యువకుల గొడవ వెనుక కారణం తెలిస్తే.. నవ్వు ఆపుకోలేరు..

ABN , First Publish Date - 2023-08-31T19:48:20+05:30 IST

‘‘ఊరు ఉసిరికాయంత.. తగవు తాటికాయంత’’.. అన్న చందంగా కొన్నిసార్లు చాలా చిన్న చిన్న కారణాలకూ పెద్ద గొడవలు జరుగుతుంటాయి. మరికొన్నిసార్లు ఇలాంటి గొడవలకు గల కారణాలు చాలా సిల్లీగా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఎక్కడ ఎలాంటి ఘటన చోటు చేసుకున్నా...

Viral Video: ఇది పానీపూరీ యుద్ధం.. ఈ యువకుల గొడవ వెనుక కారణం తెలిస్తే.. నవ్వు ఆపుకోలేరు..

‘‘ఊరు ఉసిరికాయంత.. తగవు తాటికాయంత’’.. అన్న చందంగా కొన్నిసార్లు చాలా చిన్న చిన్న కారణాలకూ పెద్ద గొడవలు జరుగుతుంటాయి. మరికొన్నిసార్లు ఇలాంటి గొడవలకు గల కారణాలు చాలా సిల్లీగా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఎక్కడ ఎలాంటి ఘటన చోటు చేసుకున్నా ఇట్టే ఫోన్లలో దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఓ తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పానీపూరీ విషయంలో యువకుల మధ్య చోటు చేసుకున్న గొడవ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఇది పానీపూరీ యుద్ధం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) హమీర్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన అఖిల్ అనే వ్యక్తి పానీపూరీ (Panipuri) బండి పెట్టుకున్నాడు. ఇదిలావుండగా, ఇటీవల ఓ రోజు కిషోర్ కుమార్ అనే యువకుడు పానీపూరీ తినేందుకు అఖిల్ వద్దకు వచ్చాడు. అఖిల్ రోజూ రూ.10లకు 5 పానీపూరీలు ఇస్తుంటాడు. ఇదే వీరి మధ్య గొడవకు (fight between youths over Panipuri) కారణమైంది. అందరి మాదిరే కిషోర్‌కూ రూ.10లకు 5పానీపూరీలు ఇచ్చాడు. అయితే ఇది అతడికి ఏమాత్రం నచ్చలేదు. ‘‘లేదు.. లేదు.. నాకు మా ఊర్లో మాదిరి రూ.10లకు 7పానీపూరీలు ఇవ్వాల్సిందే’’.. అని గొడవ పెట్టుకున్నాడు. ‘‘అలా మీ ఊర్లో ఇస్తారేమో.. ఇక్కడ రూ.10లకు 5పానీపూరీలు మాత్రమే వస్తాయ్’’.. అని అఖిల్ బదులిచ్చాడు. దీంతో ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.

Viral Video: ఇదెక్కడి గేమ్‌రా బాబోయ్.. యువకుడిని టైరులో కుక్కి తోయడంతో చివరకి ఏం జరిగిందో చూడండి..

ఈ వాగ్వాదం కాస్త.. కాసేపటికి తోపులాటకు దారితీసింది. ఈ తోపులాట చూస్తుండగానే గొడవకు దారి తీసింది. రోడ్డుపై ఒకరిపై ఒకరు జుట్టు పట్టుకుని, చొక్కాలు చించుకుంటూ కొట్టుకున్నారు. అంతా చూస్తుండగా ఇద్దరూ పల్టీలు కొట్టుకుంటూ కొట్టుకోవడం చూసి అంతా ముందు షాక్ అయ్యారు. తర్వాత విషయం తెలుసుకుని వారించే ప్రయత్నం చేశారు. అయినా వారు వినిపించుకోకుండా చాలా సేపు అలా గొడవపడుతూనే ఉన్నారు. ఈ ఘటనను చాలా మంది వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇది పానీపూరీ యుద్ధం’’.., ‘‘పానీపూరీ కోసం ఆ మాత్రం చేయకుంటే ఎలా’’.., ‘‘బెంగళూరులో రూ.30లకు ఆరు మాత్రమే వస్తాయ్ బ్రదర్’’.., ‘‘ఇది అంతర్జాతీయ సమస్యే’’.., ‘‘గోల్గప్పాల యుద్ధం’’.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఆగి ఉన్న విమానం వద్ద సిబ్బంది చేసిన పని చూసి ప్రయాణికుడు షాక్.. వెంటనే వీడియో తీయడంతో చివరికి ఏం జరిగిందంటే..

Updated Date - 2023-08-31T19:48:20+05:30 IST