Viral Video: బయట ధర్మామీటర్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత.. దీన్ని ఓ చెట్టు నీడకు తీసుకెళ్లగానే షాకింగ్ రిజల్ట్.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..!
ABN , First Publish Date - 2023-04-22T15:32:38+05:30 IST
సోషల్ మీడియాలో ఉష్ణోగ్రతకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తమ ప్రాంతంలో నమోదైన ఉష్ణోగ్రతలను ధర్మామీటర్‌లో చూపించాడు. ఎండలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. చెట్టు నీడకు వెళ్లగానే..
ఏడాదికేడాది ఎండల తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో సుమారు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టాలంటేనే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా, సోషల్ మీడియాలో ఉష్ణోగ్రతకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తమ ప్రాంతంలో నమోదైన ఉష్ణోగ్రతలను ధర్మామీటర్‌లో చూపించాడు. ఎండలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. చెట్టు నీడకు వెళ్లగానే షాకింగ్ రిజల్ట్ వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
పశ్చిమ బెంగాల్‌లో ఉష్ణోగ్రతలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Viral videos) వైరల్ అవుతోంది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం (West Bengal Govt) విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. డార్జిలింగ్, కాలింపాంగ్ (Darjeeling, Kalimpong) ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలను (Schools and colleges) ఏప్రిల్ 23వరకు మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తమ ప్రాంతంలో నమోదైన అధిక ఉష్ణోగ్రతను ధర్మామీటర్‌లో (Thermometer) చూపించాడు. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ముందుగా అతను ఆరు బయటకు వెళ్లి నిలబడగా.. 42 డిగ్రీల ఉష్ణోగ్రత చూపించింది. తర్వాత చెట్టు నీడలోకి నడుస్తూ వెళ్లాడు. బయట ఉన్న 42 డిగ్రీల ఉష్ణోగ్రత కాస్త.. క్రమ క్రమం తగ్గుతూ నీడలోకి రాగానే 27 డిగ్రీలుగా నమోదైంది. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. ‘‘వామ్మో! ఇవేం ఎండలురా బాబోయ్’’.. అంటూ కొందరు, తమ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను తెలియజేస్తూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీ ప్రాంతంలో ఎండల పరిస్థితి గురించి ఓ సారీ ఇలా ట్రై చేసి చూడండి.