Viral Video: కుందేలుతో దోస్తీ చేసిన పిల్లి.. చివరకు అచ్చం కుందేలు మాదిరే ఎలా మారిందో చూడండి..

ABN , First Publish Date - 2023-07-15T20:29:56+05:30 IST

అనుకరించడం అనేది మనుషులకు ఒక్కరికే కాదు.. చాలా జంతువులకూ బాగా తెలుసు. ప్రధానంగా చింపాంజీలు మనుషులను అనుకరించడంలో ముందుంటాయి. అలాగే కొన్ని జంతువులు ఇంకొన్ని జంతువులను అనుకరించడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన..

Viral Video: కుందేలుతో దోస్తీ చేసిన పిల్లి.. చివరకు అచ్చం కుందేలు మాదిరే ఎలా మారిందో చూడండి..

అనుకరించడం అనేది మనుషులకు ఒక్కరికే కాదు.. చాలా జంతువులకూ బాగా తెలుసు. ప్రధానంగా చింపాంజీలు మనుషులను అనుకరించడంలో ముందుంటాయి. అలాగే కొన్ని జంతువులు ఇంకొన్ని జంతువులను అనుకరించడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. కుందేలుతో దోస్తీ చేసిన పిల్లి.. చివరకు దానిలాగే ఎలా మారిందో చూస్తే.. మీరు కూడా షాక్ అవుతారు..

సోషల్ మీడియలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో పిల్లితో పాటూ ఓ కుందేలును కూడా పెంచుకుంటూ ఉన్నాడు. రెండూ ఇకే ఒంట్లో ఉండడం వల్లో ఏమో తెలీదు గానీ.. పిల్లి, కుందేలు మధ్య మంచి స్నేహం కుదిరింది. ఎంతలా అంటే, చిన్నతనంలో అన్నాతమ్ముళ్ల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో, వారు సరదాగాఎలా ఆడుకుంటూ ఉంటారో.. అచ్చం అలాగే ఈ రెండూ కూడా ఆడుకుంటూ కనిపించాయి. అలాగే రెండూ కలిసి పరుగుపందెం పోటీలు కూడా పెట్టకున్నాయి.

Newly Married Woman: మామిడిపండ్లను తిన్న వెంటనే మరణించిన కొత్త కోడలు.. వాటినే తిన్న అత్త మాత్రం సేఫ్..!

ఈ క్రమంలో కుందేలు గెంతడం చూసి.. తానూ అలాగే చేయాలని పిల్లి కూడా నిర్ణయించుకుంది. వెంటనే కుందేలు వెనుకే వెళ్తూ.. అచ్చం (cat imitating a rabbit) దాని మాదిరే గెంతుతూ వెళ్లింది. ఈ రెండింటి ఆటలు చూసి.. యజమానికి ముచ్చటేసి వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కొన్నాళ్లు పోతే పిల్లి కూడా.. క్యారెట్, గడ్డి తింటుందేమో’’.. అని కొందరు, ‘‘ఈ పిల్లికి బెస్ట్ ఇమిటేషన్ అవార్డు ఇవ్వొచ్చు’’.. అని మరికొందరు, ‘‘ఈ రెండిటినీ చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేలల్లో లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఉన్నట్టుండి పొలంలోకి పెద్ద పులి వచ్చినా.. ఉలుకూ పలుకూ లేదు.. పైగా ఏమాత్రం భయం లేకుండా..

Updated Date - 2023-07-15T20:36:02+05:30 IST