Viral: అమాయకంగా కనిపించే ఈ కుర్రాడి నిజస్వరూపం తెలిసి పోలీసులే నివ్వెరపోయారు.. అతడి వద్ద దొరికిన పెన్డ్రైవ్ను చెక్ చేస్తే..!
ABN , First Publish Date - 2023-06-08T18:54:05+05:30 IST
కొందరు పైకి అమాయకత్వంగా ఉన్నా లోపల మాత్రం బయటికి కనిపించని మనిషి దాక్కుని ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తమ పైశాచికత్వాన్ని మొత్తం బయటపెడుతుంటారు. మరికొందరు తమ వృత్తిని అడ్డు పెట్టుకుని.. లోలోపల చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ..
కొందరు పైకి అమాయకత్వంగా ఉన్నా లోపల మాత్రం బయటికి కనిపించని మనిషి దాక్కుని ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తమ పైశాచికత్వాన్ని మొత్తం బయటపెడుతుంటారు. మరికొందరు తమ వృత్తిని అడ్డు పెట్టుకుని.. లోలోపల చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వార్తలను తరచూ వింటూ ఉంటాం. తాజాగా, రాజస్థాన్లో ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ కుర్రాడు పెళ్లిళ్లలో మేళం వాయించే పని చేస్తుండేవాడు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మహిళ ఫోన్లో అతడి నంబర్ కనిపించింది. చివరకు అతడి వద్ద ఉన్న పెన్డ్రైవ్ను చెక్ చేయగా షాకింగ్ వీడియోలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లోని (Rajasthan) బార్మర్ జిల్లా సమ్దారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ముఖేష్ దమామి అనే యువకుడు.. పెళ్లిళ్లలో డ్రమ్ము, మేళం వాయిస్తుంటాడు. నిత్యం వివిధ గ్రామాల్లో జరిగే శుభకార్యాలకు వెళ్తుండడంతో ఇతడికి చాలా మంది పరిచయం అయ్యారు. అయితే ముఖేష్ దమామి మాత్రం.. యువతులు, మహిళలనే (Women) టార్గెట్ చేసేవాడు. వారి నంబర్లు తీసుకుని తరచూ ఫోన్లలో మాట్లాడుతూ ఉండేవాడు. ఇలా చాలా మందితో పరిచయం పెంచుకున్నాడు. వారికి మాయమాటలు చెబుతూ బాగా దగ్గరయ్యేవాడు. ఇలా తనని నమ్మిన వారిపై అత్యాచారానికి (Indecent behavior) పాల్పడడం, దారికి రాని వారికి మత్తు మందు ఇచ్చి దారుణానికి పాల్పడేవాడు.
వీడియోలు తీసి.. ఎవరికైనా చెబితే (Threats with Indecent videos) సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించేవాడు. దీంతో చాలా మంది బాధిత యువతులు, మహిళలు మిన్నకుండిపోయేవారు. అయితే ఇటీవల ఓ బాలిక విషయంలో కూడా ఇలాగే చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి అవమానకరంగా భావించి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల దర్యాప్తులో హస్తిమల్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో చివరకు ముఖేష్ దమామిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న పెన్ డ్రైవ్ (Pen drive) పరిశీలించగా.. చాలా వీడియోలు బయటపడ్డాయి. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.